ఏపీలో టీచర్ల బదిలీల షెడ్యూలు విడుదల | teachers transfers shedule released for andhra pradesh | Sakshi
Sakshi News home page

ఏపీలో టీచర్ల బదిలీల షెడ్యూలు విడుదల

Published Fri, Aug 28 2015 6:25 PM | Last Updated on Sat, Aug 18 2018 8:53 PM

ఏపీలో టీచర్ల బదిలీల షెడ్యూలు విడుదల - Sakshi

ఏపీలో టీచర్ల బదిలీల షెడ్యూలు విడుదల

ఆంధ్రప్రదేశ్లో ఉపాధ్యాయుల బదిలీలకు పచ్చజెండా ఊగింది. ఈ మేరకు టీచర్ల బదిలీల షెడ్యూలును రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు శుక్రవారం ప్రకటించారు. ఆగస్టు 31వ తేదీ నుంచి సెప్టెంబర్ 30 వరకు ఈ బదిలీలు జరుగుతాయని ఆయన తెలిపారు.

పాఠశాలల హేతుబద్ధీకరణ పూర్తయిందని, 2,998 స్కూళ్లను విలీనం చేశామని మంత్రి గంటా శ్రీనివాసరావు చెప్పారు. సెప్టెంబర్ 6 నుంచి టీచర్ల బదిలీలకు సంబంధించి వెబ్ కౌన్సెలింగ్ జరుగుతుందన్నారు. సెప్టెంబర్ 19న సీనియారిటీ జాబితాలను ప్రకటిస్తామని, 24 నుంచి 27 వరకు వెబ్ ఆప్షన్లను స్వీకరిస్తామని గంటా శ్రీనివాసరావు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement