ఏపీ ఇంజనీరింగ్ సీట్ల కేటాయింపు వాయిదా | AP engineering seats allocation postponed | Sakshi
Sakshi News home page

ఏపీ ఇంజనీరింగ్ సీట్ల కేటాయింపు వాయిదా

Published Tue, Jun 21 2016 1:58 AM | Last Updated on Sat, Sep 15 2018 8:28 PM

AP engineering seats allocation postponed

- ఆప్షన్ల మార్పునకు నేటి సాయంత్రం వరకు గడువు పెంపు
 సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ కాలేజీల్లో ఫీజులను ఖరారు చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయకపోవడంతో సీట్ల కేటాయింపు వాయిదా పడింది. మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు నిబంధనలకు విరుద్ధంగా 29 కాలేజీల ఫీజులను పెంచు తూ ప్రత్యేక జాబితాను ప్రభుత్వానికి అందించడమే దీనికి కారణమన్న విమర్శలు వినిపిస్తున్నాయి.  ఫీజులు ఖరారు కాకుండా సీట్ల కేటాయింపునకు అవకాశం లేకపోవడంతో 22న చేయాల్సిన సీట్ల కేటాయింపును అడ్మిషన్ల కమిటీ వాయిదా వేసింది.
 
 దీనిపై అధికారిక ప్రకటన చేయాలని భావించినా మంత్రి కార్యాలయం నుంచి అనుమతి రాలేదు. మరోపక్క ఆప్షన్ల మార్పులో సరైన సమాచారం లేనందున వేలాది మంది అభ్యర్థులు 19, 20 తేదీల్లో అవకాశాన్ని వినియోగించుకోలేకపోయారు. సీట్ల కేటాయింపు వాయిదా పడినందున అభ్యర్థులందరూ 21వ తేదీ (మంగళవారం) సాయంత్రం వరకు తమ ఆప్షన్లు మార్పు చేసుకోవచ్చని అడ్మిషన్ల కమిటీ సమాచారాన్ని పంపింది. ఈనెల 23, లేదా 24వ తేదీల్లో సీట్ల కేటాయింపు ఉంటుందని అడ్మిషన్ల కమిటీ వర్గాలు తెలిపాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement