హైదారబాద్: తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్, స్టార్ ప్లేయర్ సానియా మిర్జా అమెరికన్ అల్యూమినియం కాటమారన్ పాంటూన్ బోట్ రైడింగ్ కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు ట్యాంక్ బండ్ వద్ద ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు బేగంపేట లోని ప్లాజా హోటల్ లో ప్రెస్ మీట్ నిర్వహంచనున్నట్లు అధికారులు తెలిపారు. రిటైర్డ్ ఐపీఎస్, ఛైర్మన్ పేర్వారం రాములు, టీఎస్ టీడీసీ, క్రిస్టినా ఛోంగ్తు(ఐఏఎస్)లు ఈ లాంచింగ్ కార్యక్రమానికి హాజరుకాగా, వీరి సమక్షంలో సానియా మిర్జా ఈ బోటింగ్ ను ప్రారంభించనుంది. ప్రెస్ మీట్ లో ఈ ఈవెంట్ వివరాలను వెల్లడించనున్నారు.
బోట్ ఈవెంట్ ప్రారంభించనున్న సానియా
Published Tue, Mar 1 2016 8:38 PM | Last Updated on Wed, Apr 3 2019 5:24 PM
Advertisement
Advertisement