ఐఐటీల్లో సీట్ల కేటాయింపు
ఒకవేళ ఒరిజినల్ హాల్‌టికెట్ పోగొట్టుకుంటే డూప్లికేట్ హాల్‌టికెట్ కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ‘ఆర్గనైజింగ్ చైర్మన్ జేఈఈ అడ్వాన్స్‌డ్ 2017 పేయబుల్ ఎట్ చెన్నై’ పేరుతో రూ.1,000 డీడీ తీసి సంబంధిత జోనల్ ఐఐటీలో అందజేసి డూప్లికేట్ అడ్మిట్ కార్డు పొందొచ్చని వివరించింది. ఈసారి ఐఐటీ, ఎన్‌ఐటీ, ట్రిపుల్ ఐటీ, జీఎఫ్‌టీఐల్లో తెలంగాణకు చెందిన దాదాపు 3,600 మంది విద్యార్థులకు సీట్లు లభించినట్లు తెలిసింది. ఇందులో ఐఐటీల్లో 1,000 మంది వరకు సీట్లు లభించినట్లు సమాచారం. గతేడాది 3,531 మందికి సీట్లు లభించగా, అందులో ఐఐటీల్లో 931 మందికి, ఎన్‌ఐటీ, ట్రిపుల్‌ఐటీ, జీఎఫ్‌టీఐలలో 2,600 మందికి సీట్లు లభించాయి.
ఇక ఏపీ నుంచి 3,300 మంది విద్యార్థులకు సీట్లు లభించినట్లు తెలిసింది. గతేడాది ఏపీ విద్యార్థులకు ఐఐటీల్లో 822 మందికి సీట్లు లభించగా, మిగతా విద్యాసంస్థల్లో 2,391 మందికి సీట్లు లభించాయి. టాప్ ర్యాంకర్లలో ఎక్కువ మంది విద్యార్థులకు ఐఐటీ బాంబేలో సీట్లు లభించాయి. జాతీయ స్థాయిలో 36,114 మందికి సీట్లు కేటాయించగా, అందులో ఐఐటీల్లో 11 వేల మందికి సీట్లు కేటాయించారు. అందులో 994 మంది బాలికలకు సీట్లు లభించాయి. ఎన్‌ఐటీల్లో 18 వేల మందికి, జీఎఫ్‌టీఐల్లో 3 వేల మందికి సీట్లు లభించాయి.