నీటి లెక్కలన్నీ మా ముందుంచండి
కృష్ణా బోర్డును కోరిన ఐదుగురు సభ్యుల కమిటీ
సాక్షి, హైదరాబాద్: కృష్ణా నదీ జల వివాదాల కు సంబంధించిన అన్ని అంశాలను తమ ముందుంచాలని కేంద్ర జలవనరుల శాఖ నియమించిన ఐదుగురు సభ్యుల కమిటీ కృష్ణా బోర్డును ఆదేశించింది. ఈ వివరాల ఆధారంగా మొదటగా బోర్డుతో అన్ని అంశాలపై చర్చించి, తర్వాత భాగస్వామ్య రాష్ట్రాలతో సంప్రదింపులు జరుపుతామంది. ఈ మేరకు కేంద్రం ఏర్పాటు చేసిన కమిటీ సోమవారం ఢిల్లీలో ప్రాథమిక భేటీ నిర్వ హించినట్లు తెలిసింది. కమిటీ చైర్మన్ ఏకే బజాజ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి సభ్యులు ఎం.గోపాలకృష్ణన్, ఆర్‌పీ పాండే, ప్రదీప్‌కుమార్‌శుక్లా, ఎన్‌ఎన్ రాయ్‌లు హాజ రయ్యారు. తెలంగాణ, ఏపీల మధ్య ఉమ్మడి ప్రాజెక్టుల నిర్వహణ అంశాలపై నియమా వళి, మార్గదర్శకాలు రూపొందించే అంశంపై ప్రాథమికంగా చర్చ జరిగినట్లు సమాచారం. గోదావరికి కేటాయించిన నీటిని కృష్ణాకు తరలించే అంశాలపై ట్రిబ్యునల్ తీర్పులు, వివాదాలకు కారణాలపై అధ్యయనం చేయా లని కమిటీ నిర్ణయించినట్లు భోగట్టా. వివా దాలు, నీటి లెక్కలన్నీ బోర్డు అందజేస్తే వాటిపై ప్రాథమిక అవగాహనకు రావొచ్చని, అనంతరం దీనిపై రాష్ట్రాలతో చర్చించాలని నిర్ణయించినట్లు సమాచారం.
నీటి విడుదల ఆదేశాలు పాటించండి
కాగా ఏపీ, తెలంగాణలకు ప్రస్తుత రబీ అవ సరాల కోసం నీటిని కేటాయిస్తూ ఇప్పటికే ఇచ్చిన ఆదేశాలను పాటించాలని బోర్డు ఇరు రాష్ట్రాలను కోరింది. ఈ మేరకు బోర్డు సభ్య కార్యదర్శి సమీర్ చటర్జీ ఇరు రాష్ట్రాలకు లేఖలు రాశారు. శ్రీశైలం, నాగార్జునసాగర్‌ల నుంచి నీటి విడుదల విషయంలో ఇచ్చిన ఆదేశాలు అమల్లోకి రావడం లేదని తమ దృష్టికి వచ్చినట్లు తెలిపింది.