Central Department of Water Resources
-
ఇద్దరి హక్కులకూ భద్రత
సాక్షి, అమరావతి: కృష్ణా, గోదావరి జలాలపై రెండు రాష్ట్రాల హక్కులను పరిరక్షించేలా బోర్డుల పరిధిని ఖరారు చేస్తూ కేంద్ర జల్ శక్తి శాఖ నోటిఫికేషన్ జారీ చేయడాన్ని స్వాగతిస్తూనే అందులో కొన్ని అంశాలపై సవరణలను ప్రతిపాదించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. బచావత్ ట్రిబ్యునల్ ఉమ్మడి రాష్ట్రానికి కేటాయించిన జలాల్లో ఆంధ్రప్రదేశ్‌కు దక్కిన 512, తెలంగాణకు దక్కిన 299 టీఎంసీలను పంపిణీ చేయడంపైనే కృష్ణా బోర్డు ప్రధానంగా దృష్టి కేంద్రీకరించేలా చూడాలని విజ్ఞప్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. కృష్ణా డెల్టా, నాగార్జునసాగర్ కుడి, ఎడమ కాలువ ఆయకట్టుకు గోదావరి వరద జలాలను మళ్లించగా.. అక్కడ మిగిలే కృష్ణా నీటిని తీవ్ర దుర్భిక్ష ప్రాంతాలైన రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు మళ్లించుకునే స్వేచ్ఛ కల్పించడం ద్వారా ఆ ప్రాంతాల సాగు, తాగునీటి ఇబ్బందులను అధిగమించడానికి మార్గం సుగమం చేయాలని కేంద్రాన్ని కోరాలని భావిస్తోంది. విభజన చట్టం 11వ షెడ్యూల్లో అప్పటికే నిర్మాణంలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌లోని తెలుగుగంగ, గాలేరు–నగరి, వెలిగొండ, హంద్రీ–నీవా, తెలంగాణలోని నెట్టెంపాడు (22 టీఎంసీలు), కల్వకుర్తి (25 టీఎంసీలు) కేంద్రం అనుమతి ఇచ్చిందని.. ఇప్పుడు వాటికి ఆర్నెళ్లలోగా మళ్లీ అనుమతి తీసుకోవాలంటూ విధించిన నిబంధనను ఉపసంహరించుకోవాల్సిందిగా కోరనుంది. విభజన చట్టం ద్వారా ఆ ప్రాజెక్టులకు కల్పించిన రక్షణను కొనసాగించాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని గుర్తు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిని ఖరారు చేస్తూ కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసిన నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం జలవనరుల శాఖ కార్యదర్శి జె.శ్యామలరావు, ఈఎన్సీ సి.నారాయణరెడ్డి తదితరులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. బోర్డులను ఏర్పాటు చేసిన ఏడేళ్ల తర్వాత వాటి పరిధిని ఖరారు చేయడాన్ని స్వాగతిస్తూనే కొన్ని మార్పులు చేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే తుంగభద్ర బోర్డు పరిధిలో హెచ్చెల్సీ, ఎల్లెల్సీ.. తుంగభద్ర ఎగువ ప్రధాన కాలువ (హెచ్చెల్సీ), దిగువ ప్రధాన కాలువ (ఎల్లెల్సీ) ఇప్పటికే తుంగభద్ర బోర్డు పరిధిలో ఉన్నాయి. తుంగభద్ర జలాశయంలో నీటి లభ్యత ఆధారంగా హెచ్చెల్సీకి కేటాయించిన 32.5, ఎల్లెల్సీకి కేటాయించిన 29.5 టీఎంసీలను దామాషా పద్ధతిలో తుంగభద్ర బోర్డు పంపిణీ చేస్తోంది. వాటికి తుంగభద్ర జలాశయంలో నీటిని విడుదల చేసినప్పుడు రాష్ట్ర సరిహద్దులోనూ టెలీమీటర్ల ద్వారా ఎప్పటికప్పుడు లెక్కిస్తోంది. ఈ నేపథ్యంలో హెచ్చెల్సీ, ఎల్లెల్సీలను మళ్లీ కృష్ణా బోర్డు పరిధిలోకి తేవాల్సిన అవసరం లేదని, వాటిని పరిధి నుంచి తప్పించాలని కేంద్రానికి వి/æ్ఞప్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వద్ద లెక్కిస్తే చాలు.. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా తెలుగుగంగ, ఎస్సార్బీసీ, గాలేరు–నగరి ప్రాజెక్టులకు నీటిని విడుదల చేస్తారు. ఈ ప్రాజెక్టులకు నీటిని విడుదల చేసే ప్రాంతమైన పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్‌ను కృష్ణా బోర్డు పరిధిలోకి తీసుకుని కేటాయించిన నీటిని విడుదల చేసేటప్పుడు టెలీమీటర్ల ద్వారా లెక్కిస్తే సరిపోతుంది. ఈ నేపథ్యంలో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ దిగువన ఉన్న బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్, నిప్పులవాగు ఎస్కేప్ ఛానల్, వెలిగోడు రిజర్వాయర్, తెలుగుగంగ లింక్ కెనాల్, ఎస్సార్బీసీ నుంచి అవుకు రిజర్వాయర్ వరకు కాలువల వ్యవస్థలను కృష్ణా బోర్డు పరిధిలోకి తీసుకుని అక్కడ నీటిని లెక్కించాల్సిన అవసరం లేదని నీటిపారుదల రంగ నిపుణులు పేర్కొంటున్నారు. దీనివల్ల బోర్డుకు భారం మినహా ఎలాంటి ప్రయోజనం ఉండదని స్పష్టం చేస్తున్నారు. అందువల్ల పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వరకే కృష్ణా బోర్డు పరిధిని పరిమితం చేసేలా కేంద్రానికి సూచించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆయకట్టుకు నీళ్లందిస్తున్న ప్రాజెక్టులకు అనుమతి లేదంటే ఎలా? వెంకటనగరం ఎత్తిపోతల 2006 నాటికే పూర్తయిందని, తెలుగుగంగ ఆయకట్టును స్థిరీకరించడానికి చేపట్టిన సిద్ధాపురం ఎత్తిపోతల, ఎల్లెల్సీ ఆయకట్టు స్థిరీకరణకు చేపట్టిన గురు రాఘవేంద్ర ఎత్తిపోతల పథకం 2008 నాటికే పూర్తైందని, ఆయకట్టుకు నీళ్లందిస్తున్న ఆ ప్రాజెక్టులకు అనుమతి లేదనడం సరి కాదని కేంద్రానికి వివరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే పూర్తై ఆయకట్టుకు నీళ్లందిస్తున్న ప్రాజెక్టులకు ఆర్నెళ్లలోగా అనుమతి తీసుకోవాలనే నిబంధనను ఉపసంహరించుకోవాల్సిందిగా ప్రతిపాదించనుంది. ఎగువ రాష్ట్రాలతో సంబంధం లేని ప్రాజెక్టులు బోర్డు పరిధిలోకి ఎందుకు? కృష్ణా డెల్టాకు నీళ్లందించే ప్రకాశం బ్యారేజీ, గోదావరి డెల్టాకు నీళ్లందించే ధవళేశ్వరం బ్యారేజీ, పోలవరం, పోలవరం దిగువన తొర్రిగడ్డ పంపింగ్ స్కీం, వెంకటనగరం ఎత్తిపోతల, పుష్కర, పురుషోత్తపట్నం, తాడిపూడి, పట్టిసీమ, చింతలపూడి ఎత్తిపోతల వల్ల ఎగువ రాష్ట్రాల ప్రయోజనాలకు ఎలాంటి విఘాతం కలగదని నీటిపారుదలరంగ నిపుణులు గుర్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వాటిని కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిలోకి తేవడం వల్ల అదనపు భారం మినహా ఎలాంటి ప్రయోజనం ఉండదని పేర్కొంటున్నారు. ఈ దృష్ట్యా వాటిని బోర్డుల పరిధి నుంచి తప్పించాలని కేంద్రానికి ప్రతిపాదించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఉమ్మడి ప్రయోజనాలున్న ప్రాజెక్టులు బోర్డు పరిధిలోకి తీసుకుంటే సరి.. గోదావరి పరీవాహక ప్రాంతం(బేసిన్)లో ఉమ్మడి ప్రాజెక్టులు ఏవీ లేవు. కానీ.. కృష్ణా బేసిన్లో శ్రీశైలం, నాగార్జునసాగర్‌లు ఉమ్మడి ప్రాజెక్టులు. జూరాల, పులిచింతల ఉమ్మడి ప్రయోజనాలతో ముడిపడిన ప్రాజెక్టులు. ఇందులో శ్రీశైలం, నాగార్జునసాగర్, జూరాల ప్రాజెక్టుల స్పిల్ వేలు, వాటికి అనుబంధంగా ఉన్న విద్యుదుత్పత్తి కేంద్రాలు, వాటిపై ఆధారపడ్డ ఆయకట్టుకు నీటిని విడుదల చేసే ప్రధాన ప్రాంతాలు(ఇన్‌టేక్‌లు), ఎత్తిపోతల పథకాల పంప్‌హౌస్‌లను కృష్ణా బోర్డు పరిధిలోకి తీసుకుని నీటి వినియోగాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం, పులిచింతలలో విద్యుదుత్పత్తి కేంద్రాన్ని బోర్డు పరిధిలోకి తీసుకుని నిర్వహిస్తే సరిపోతుందని నీటిపారుదలరంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. దీనివల్ల బోర్డుపై అదనపు భారం తగ్గుతుందని పేర్కొంటున్నారు. బోర్డుల పరిధి విస్తృతమైతే వాటి పరిధిలోని ప్రాజెక్టులు, కాలువల వ్యవస్థ నిర్వహణకు భారీ ఎత్తున వ్యయం అవుతుందని, దీనివల్ల రెండు రాష్ట్రాలపైనా ఆర్థికంగా తీవ్ర భారం పడుతుందని విశ్లేషిస్తున్నారు. నీటి లభ్యత ఆధారంగా దామాషాలో పంపిణీ.. రెండు రాష్ట్రాల్లోని కృష్ణా బేసిన్లో నీటి లభ్యత బచావత్ ట్రిబ్యునల్ కేటాయించిన మేరకు 811 టీఎంసీలు ఉంటే 66 : 34 నిష్పత్తిలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు పంపిణీ చేయాలని, ఒకవేళ వర్షాభావంతో లభ్యత తగ్గితే అదే నిష్పత్తిలో దామాషా పద్ధతిలో నీటి పంపిణీ చేసేలా కృష్ణా బోర్డుకు నిర్దేశించాలని కేంద్రాన్ని కోరేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్దమైంది. 2019–20, 2020–21 తరహాలోనే బేసిన్లో భారీ ఎత్తున వరద వస్తే.. శ్రీశైలం, సాగర్, పులిచింతల, ప్రకాశం బ్యారేజీ గేట్లు ఎత్తివేసి వరద జలాలు సముద్రంలో కలిసే సమయంలో రెండు రాష్ట్రాల్లో ఎవరు ఏ స్థాయిలో నీటిని మళ్లించుకున్నా వాటిని పరిగణలోకి తీసుకోకూడదని వి/æ్ఞప్తి చేయనుంది. తద్వారా దిగువ రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ హక్కులను పరిరక్షించాలని కోరనుంది. -
కేంద్రాన్ని మెప్పించి.. ఒప్పించి
సాక్షి, అమరావతి: రాష్ట్రానికి కల్పతరువు లాంటి పోలవరం ప్రాజెక్టుకు మాజీ సీఎం చంద్రబాబు చేసిన ద్రోహాన్ని కేంద్ర జల్‌శక్తి శాఖ ఆర్థిక సలహాదారు జగ్‌మోహన్‌గుప్తా నేతృత్వంలోని రివైజ్డ్ ఎస్టిమేట్స్ కమిటీ(ఆర్ఈసీ) బహిర్గతం చేసింది. ప్రాజెక్టు బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించి నీటిపారుదల విభాగానికి అయ్యే ఖర్చును విడుదల చేస్తే చాలని నాడు కేంద్రాన్ని చంద్రబాబు అభ్యర్థించారని గుర్తు చేసింది. ఈ నేపథ్యంలో 2014 ఏప్రిల్ 1 నాటికి ప్రాజెక్టులో మిగిలిన నీటిపారుదల వ్యయం రూ.8,006.18 కోట్లేనని.. ఆ మేరకు కేంద్రం నిధులు ఇచ్చేసిందని పేర్కొనడంపై సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం అభ్యంతరం తెలిపింది. విభజన చట్టం సెక్షన్90(4) ప్రకారం పోలవరం నిర్మాణ బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని, ఎంత వ్యయమైతే అంత ఖర్చు కేంద్రమే భరించాలని స్పష్టం చేసింది. భూసేకరణ చట్టం 2013 వల్ల పోలవరం భూసేకరణ, నిర్వాసితుల పునరావాసం వ్యయం భారీగా పెరిగినందున ఆ మేరకు కేంద్రం నిధులు విడుదల చేయాలని పట్టుబట్టింది. పోలవరం పనులను ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వం ప్రక్షాళన చేయడం, రివర్స్ టెండర్ల ద్వారా రూ.838 కోట్లను ఆదా చేయడం, గడువులోగా ప్రాజెక్టును పూర్తి చేసేలా చిత్తశుద్ధితో వ్యవహరిస్తుండటంతో ఆర్ఈసీ సానుకూలంగా స్పందించి 2017–18 ధరల ప్రకారం పోలవరం సవరించిన అంచనాలను రూ.47,725.74 కోట్లుగా ఖరారు చేసింది. జలవిద్యుదుత్పత్తి కేంద్రం వ్యయం రూ.4,124.64 కోట్లు, నీటిపారుదల విభాగం వ్యయం రూ.43,164.83 కోట్లని నిర్ధారిస్తూ కేంద్ర జల్ శక్తి శాఖకు మార్చి 6న ఆర్ఈసీ నివేదిక ఇచ్చింది. ఆ నివేదికను కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ యథాతథంగా సోమవారం ఆమోదించారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం పోరాటం చేయకపోయి ఉంటే చంద్రబాబు సర్కార్ నిర్వాకం వల్ల రాష్ట్ర ఖజానాపై రూ.36 వేల కోట్లకుపైగా పెనుభారం పడేదని అధికార వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. బాబు నిర్వాకాలు ఇవిగో.. ► పీపీఏ పర్యవేక్షణ ఉంటే పోలవరం పనుల్లో కమీషన్లు వసూలు చేసుకోవడం సాధ్యం కాదని పసిగట్టిన చంద్రబాబు ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టి 2016 సెప్టెంబర్ 7 అర్థరాత్రి పోలవరం పనులను దక్కించుకున్నారు. ► చంద్రబాబు ప్రతిపాదన మేరకు 2014 ఏప్రిల్ 1 నాటికి మిగిలిన నీటిపారుదల విభాగానికి అయ్యే వ్యయాన్ని మాత్రమే రీయింబర్స్ చేస్తామని కేంద్రం స్పష్టం చేసింది. 2010–11 ధరల ప్రకారం పోలవరం వ్యయం రూ.16,010.45 కోట్లు. ఏప్రిల్ 1, 2014 నాటికి రూ.5,135.87 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసింది. జలవిద్యుదుత్పత్తి ప్రాజెక్టు వ్యయం రూ.2,868.40 కోట్లు పోనూ మిగిలిన రూ.8,006.18 కోట్లు మాత్రమే ఇస్తామని కేంద్రం పరోక్షంగా తేల్చిచెప్పింది. ► ఆ మరుసటి రోజే అంటే 2016 సెప్టెంబరు 8న పోలవరం అంచనా వ్యయాన్ని టీడీపీ సర్కార్ పెంచేసి పనులన్నీ సబ్ కాంట్రాక్టులపై అప్పగించి కమీషన్లు వసూలు చేసుకుంది. ► పోలవరానికి నాబార్డు నుంచి తొలి విడతగా రూ.1,982 కోట్ల రుణాన్ని తీసుకుని ఎన్‌డబ్ల్యూడీఏ, పీపీఏల ద్వారా ఆ చెక్‌ను డిసెంబర్ 26, 2016న అప్పటి సీఎం చంద్రబాబుకు నాటి కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అందజేశారు. డిసెంబర్, 2018లోగా ప్రాజెక్టును పూర్తి చేయకుంటే.. అప్పటిదాకా విడుదల చేసిన నిధులను రుణంగా పరిగణిస్తామని కేంద్రం విధించిన షరతుకు అంగీకరిస్తూ చంద్రబాబు సంతకం చేయడం గమనార్హం. ► కమీషన్ల కక్కుర్తితో చంద్రబాబు తీసుకున్న ఈ నిర్ణయాల రాష్ట్ర ప్రభుత్వం అంచనా వ్యయం రూపంలోనే రూ.30,022.78 కోట్లు నష్టపోయింది. 2018లోగా ప్రాజెక్టును పూర్తి చేయకపోవడం వల్ల అప్పటిదాకా కేంద్రం విడుదల చేసిన రూ.6,727.26 కోట్లను రుణంగా పరిగణించింది. వెరసి మొత్తమ్మీద ఖజానాపై రూ.36,750.04 కోట్ల భారం పడింది. ► పోలవరాన్ని చంద్రబాబు కమీషన్ల కోసం ఏటీఎంగా మార్చుకున్నారని సాక్షాత్తూ ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారంటే ప్రాజెక్టులో ఏ స్థాయిలో అక్రమాలు చోటుచేసుకున్నాయో గ్రహించవచ్చు. సీఎం జగన్ నిర్ణయాలతో మారిన కేంద్రం వైఖరి.. ► ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి బాధ్యతలు స్వీకరించాక నిపుణుల కమిటీతో పోలవరం పనులను ప్రక్షాళన చేయించారు. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగంతో దర్యాప్తు చేయించారు. రివర్స్ టెండరింగ్ ద్వారా ఖజానాకు రూ.838 కోట్లను మిగిల్చారు. ఇదే అంశాన్ని ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌కు వివరించారు. సవరించిన అంచనా వ్యయం మేరకు నిధులు విడుదల చేసి ప్రాజెక్టును 2021 నాటికి పూర్తిచేసేలా సహకరించాలని కోరారు. ► పోలవరం పనుల్లో అక్రమాలకు పూర్తిగా అడ్డుకట్ట వేయడంతోపాటు ప్రాజెక్టును గడువులోగా పూర్తి చేసేలా ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరిస్తోందని కేంద్ర జలసంఘం సభ్యులు హెచ్‌కే హల్దార్ నేతృత్వంలోని అత్యున్నత స్థాయి నిపుణుల కమిటీ , పీపీఏ సీఈవో చంద్రశేఖర్ అయ్యర్లు కేంద్రానికి నివేదిక ఇచ్చారు. ఆర్ఈసీ కూడా అదే రీతిలో నివేదిక ఇవ్వడంతో కేంద్రం వైఖరిలో మార్పు వచ్చింది. ‘పోలవరం’ సందర్శన సందర్భంగా ప్రాజెక్ట్ మ్యాప్‌ను పరిశీలిస్తున్న సీఎం వైఎస్ జగన్ (ఫైల్) ఇంకా రావాల్సింది రూ.29,521.70 కోట్లు... ► 2017–18 ధరల ప్రకారం పోలవరం సవరించిన అంచనా వ్యయాన్ని రూ.55,656.87 కోట్లుగా కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ) ఆమోదించి ఆర్ఈసీకి నివేదిక పంపింది. ► సీడబ్ల్యూసీ నివేదికపై పలుమార్లు చర్చించిన ఆర్ఈసీ చంద్రబాబు అధికారంలో ఉండగా అర్థరాత్రి కేంద్రంతో చేసుకున్న ఒప్పందాన్ని బహిర్గతం చేస్తూ ఇక నిధులు ఇవ్వాల్సిన అవసరం లేదని పేర్కొంది. ► అయితే విభజన చట్టం ప్రకారం పోలవరాన్ని పూర్తి చేసేందుకు ఎన్ని నిధులు అవసరమైతే అన్ని నిధులను కేంద్రం విడుదల చేయాల్సిందేనని ఆర్ఈసీకి ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇదే అంశంపై ప్రధాని మోదీ, కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌లతో సీఎం జగన్ చర్చించారు. ► ఈ క్రమంలో 2017–18 ధరల ప్రకారం పోలవరం సవరించిన అంచనా వ్యయాన్ని రూ.47,725.74 కోట్లుగా ఈనెల 6న ఆర్ఈసీ నిర్ధారించి ఆమోదించింది. ► నీటిపారుదల వ్యయం రూ.43,164.83 కోట్లు, 2014 ఏప్రిల్ 1 వరకు పనులకు చేసిన వ్యయం రూ.5,135.87 కోట్లు, ఇప్పటిదాకా కేంద్రం రీయింబర్స్ చేసిన నిధులు రూ.8,507.26 కోట్లను మినహాయిస్తే రాష్ట్ర ప్రభుత్వానికి ఇంకా రూ.29,521.70 కోట్లను కేంద్రం విడుదల చేయాల్సి ఉంటుంది. -
జల జగడాలకు చెక్
ఒకే శాశ్వత ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేయనున్న కేంద్రం సాక్షి, హైదరాబాద్: అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదాలను త్వరితగతిన పరిష్కరించే దిశగా కేంద్రం ముందడుగు వేయనుంది. అన్నీ కుదిరితే పార్లమెంటు ప్రస్తుత బడ్జెట్ సమావేశాల్లోనే జల జగడాలకు శాశ్వత పరిష్కారం చూపే రెండు బిల్లులను ప్రవేశపెట్టనుంది. ఇందులో ఒకటి దేశంలోని అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదాలను విచారిం చడానికి ప్రస్తుతమున్న వివిధ ట్రిబ్యునళ్లను రద్దు చేసి ఒకే శాశ్వత ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేసే బిల్లు కాగా, అంతర్రాష్ట్ర వివాదాలన్నింటినీ చర్చలు, మధ్యవర్తుల ద్వారానే పరిష్కరించుకునేలా చూసే జాతీయ జల విధాన బిల్లు మరొకటి. ఇందులో ఒకే శాశ్వత ట్రిబ్యునల్ ఏర్పాటుకు తెలంగాణ అంగీకారం తెలుపగా జాతీయ జల విధానంపై సైతం అభిప్రాయాలు కోరుతూ కేంద్ర జలవనరులశాఖ కార్యదర్శి అమర్జిత్సింగ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాశారు. జల ఒప్పందాలపై 30 ఏళ్లకోసారి సమీక్ష... నదీ జలాలపై రాష్ట్రాలకు ఉండే హక్కులు, ట్రిబ్యునల్ తీర్పుల అమలు, వాటి సమీక్షలకు అనుగుణంగా ‘జాతీయ జల విధాన బిల్లు–2017’ను తెచ్చేందుకు కేం ద్రం కసరత్తు చేస్తోంది. ఇప్పటికే దీనిపై అభిప్రాయాలను తెలపాలని రాష్ట్రాలను కోరింది. బిల్లులో పేర్కొన్న అంశా ల్లో అంతర్రాష్ట్ర వివాదాల అంశానికి ప్రాధాన్యం కల్పించా రు. ఈ బిల్లు ప్రకారం అంతర్రాష్ట్ర వివాదాలన్నింటినీ చర్చలు, మధ్యవర్తుల ద్వారానే పరిష్కారించుకోవాల్సి ఉంటుంది. వివాదం తలెత్తే పరిస్థితి ఉంటే అది జటిల మయ్యే వరకు చూడకుండా ముందుగానే పరిష్కారం కనుగొనాల్సి ఉంటుంది. అంతర్రాష్ట్ర జల ఒప్పందాలను 30 ఏళ్లకోసారి సమీక్షించేలా ఈ బిల్లు ఉండనుందని కేంద్రం రాష్ట్రానికి రాసిన లేఖలో పేర్కొంది. మూడేళ్లలో తీర్పు.. రాష్ట్రాల ఫిర్యాదులను వేగంగా పరిష్కరించే దిశగా ఒకే ట్రిబ్యునల్ అంశాన్ని కేంద్రం తెరపైకి తెచ్చింది. ఇందుకోసం ప్రస్తుతం ఉన్న చట్టాలను సవరించనుంది. ప్రతిపాదిత శాశ్వత ట్రిబ్యునల్‌కు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి చైర్‌పర్సన్‌గా ఉండనున్నారు. ఈ ట్రిబ్యునల్ మూడేళ్లలో తన తీర్పును వెలువరించాల్సి ఉంటుంది. -
వైఎస్ హయాంలోనే పోలవరానికి అనుమతులు
చంద్రబాబు నోటివెంట పోలవరం మాట ఎప్పుడూ రాలేదు: కేవీపీ సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఉన్న ప్పుడు, కాంగ్రెస్ హయాంలోనే పోలవరానికి పర్యావరణ, వన్యప్రాణి, గిరిజన మంత్రిత్వశాఖ, కేంద్ర జలవనరుల శాఖ, ఆర్థికశాఖతో పాటు అన్ని అనుమతులు వచ్చాయని రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు అన్నారు. ఇక్కడి ఇందిరా భవన్లో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. కాంగ్రెస్‌కు, వైఎస్‌కు పేరు వస్తుందనే భయంతోనే సామాన్యుడైన చంద్రబాబును ఎమ్మెల్యేగా, మంత్రిగా చేసిన ఇందిరాగాంధీ పేరిట ఉన్న ప్రాజెక్టు పేరును మార్చారని విమర్శించారు. ‘చంద్రబాబు నోటి నుంచి పోలవరం అనే మాట ఎప్పుడూ రాలేదు. అలాంటి నోటితోనే పోలవరం నా కల అని చంద్రబాబు మాట్లాడటమే విచిత్రం, ఆశ్చర్యం. వైఎస్ వంటి ఎందరో మహానుభావుల కృషి, త్యాగం ఫలితంగా సాకారం కాబోతున్న పోలవరం నిర్మాణాన్ని చంద్రబాబు కలగా, జీవితాశయంగా, కృషిఫలితంగా వచ్చిందని చెప్పుకోవడం మేధావులు ఊహించలేరమో. ఇతరుల ఆస్తులు, పదవులు, కీర్తి, ప్రతిష్ట, ఆలోచనలు సొంతం చేసుకునే అలవాటు చంద్రబాబుకు ఉందని అనుకున్నారు. ఇతరుల కలలను సైతం సొంతం చేసుకోగల దుర్మార్గపు తెలివితేటలున్న చంద్రబాబు రాబోయే తరాలకు ఒక కొత్త పాఠం’ అని కేవీపీ వ్యాఖ్యానించారు. ఇందిరాసాగర్ పేరుతో అనుమతులు రావడానికి ముఖ్యమంత్రిగా వైఎస్ పడిన కష్టం, చేసిన కృషి ఏమిటో తనకు తెలుసని కేవీపీ చెప్పారు. -
నీటి లెక్కలన్నీ మా ముందుంచండి
కృష్ణా బోర్డును కోరిన ఐదుగురు సభ్యుల కమిటీ సాక్షి, హైదరాబాద్: కృష్ణా నదీ జల వివాదాల కు సంబంధించిన అన్ని అంశాలను తమ ముందుంచాలని కేంద్ర జలవనరుల శాఖ నియమించిన ఐదుగురు సభ్యుల కమిటీ కృష్ణా బోర్డును ఆదేశించింది. ఈ వివరాల ఆధారంగా మొదటగా బోర్డుతో అన్ని అంశాలపై చర్చించి, తర్వాత భాగస్వామ్య రాష్ట్రాలతో సంప్రదింపులు జరుపుతామంది. ఈ మేరకు కేంద్రం ఏర్పాటు చేసిన కమిటీ సోమవారం ఢిల్లీలో ప్రాథమిక భేటీ నిర్వ హించినట్లు తెలిసింది. కమిటీ చైర్మన్ ఏకే బజాజ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి సభ్యులు ఎం.గోపాలకృష్ణన్, ఆర్పీ పాండే, ప్రదీప్‌కుమార్‌శుక్లా, ఎన్ఎన్ రాయ్‌లు హాజ రయ్యారు. తెలంగాణ, ఏపీల మధ్య ఉమ్మడి ప్రాజెక్టుల నిర్వహణ అంశాలపై నియమా వళి, మార్గదర్శకాలు రూపొందించే అంశంపై ప్రాథమికంగా చర్చ జరిగినట్లు సమాచారం. గోదావరికి కేటాయించిన నీటిని కృష్ణాకు తరలించే అంశాలపై ట్రిబ్యునల్ తీర్పులు, వివాదాలకు కారణాలపై అధ్యయనం చేయా లని కమిటీ నిర్ణయించినట్లు భోగట్టా. వివా దాలు, నీటి లెక్కలన్నీ బోర్డు అందజేస్తే వాటిపై ప్రాథమిక అవగాహనకు రావొచ్చని, అనంతరం దీనిపై రాష్ట్రాలతో చర్చించాలని నిర్ణయించినట్లు సమాచారం. నీటి విడుదల ఆదేశాలు పాటించండి కాగా ఏపీ, తెలంగాణలకు ప్రస్తుత రబీ అవ సరాల కోసం నీటిని కేటాయిస్తూ ఇప్పటికే ఇచ్చిన ఆదేశాలను పాటించాలని బోర్డు ఇరు రాష్ట్రాలను కోరింది. ఈ మేరకు బోర్డు సభ్య కార్యదర్శి సమీర్ చటర్జీ ఇరు రాష్ట్రాలకు లేఖలు రాశారు. శ్రీశైలం, నాగార్జునసాగర్‌ల నుంచి నీటి విడుదల విషయంలో ఇచ్చిన ఆదేశాలు అమల్లోకి రావడం లేదని తమ దృష్టికి వచ్చినట్లు తెలిపింది. -
‘మిషన్’కు రూ.5 వేల కోట్లివ్వండి
ఆర్థిక మంత్రి జైట్లీకి సీఎం కేసీఆర్ లేఖ సాక్షి, హైదరాబాద్ : జల సంరక్షణ, భూగర్భ జలాల అభివృద్ధి లక్ష్యంగా చెరువుల పునరుద్ధరణ కోసం చేపట్టిన మిషన్ కాకతీయ కార్యక్రమానికి రూ. 5 వేల కోట్ల సాయం అందించాలని సీఎం కేసీఆర్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి ఆయన శనివారం లేఖ రాశారు. వచ్చే మూడేళ్ల కోసం మిషన్ కాకతీయ కోసం రూ. 5 వేల కోట్ల సాయం అందించాలని నీతి ఆయోగ్ చేసిన సిఫారసులను సీఎం తన లేఖలో ప్రస్తావించారు. అలాగే తెలంగాణలోని వెనకబడిన ప్రాంతాలకు ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ ప్రకటించాలని ఏపీ పునర్విభజన చట్టం చెబుతోందని...అందుకనుగుణంగానే మిషన్ కాకతీయ, మిషన్ భగీరథకు 2015-19 కాలానికి రూ. 30,571 కోట్ల ప్యాకేజీ ఇవ్వాలని గతంలో కోరిన విషయాన్ని కేసీఆర్ గుర్తుచేశారు. కేంద్ర జలవనరులశాఖ ద్వారా దేశవ్యాప్తంగా జల సంరక్షణ, భూగర్భ జలాల అభివృద్ధి కోసం కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని సీఎం అన్నారు. అదే లక్ష్యంతో మిషన్ కాకతీయ ద్వారా చెరువుల పునరుద్ధరణ చేపడుతున్నట్లు సీఎం తెలిపారు. మిషన్ కాకతీయ పురోగతి, కార్యక్రమాలను సీఎం లేఖలో వివరించారు. -
పీఎంకేఎస్వైలో 11 తెలంగాణ ప్రాజెక్టులు
♦ ఇందుకు కేంద్ర సబ్ కమిటీ అంగీకరించింది ♦ రాష్ట్ర నీటిపారుదల మంత్రి హరీశ్‌రావు వెల్లడి సాక్షి, న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి కృషి సించాయ్ యోజన (పీఎంకేఎస్‌వై) కింద తెలంగాణకు చెందిన 11 ప్రాజెక్టులను చేర్చేందుకు కేంద్ర జలవనరులశాఖ సబ్ కమిటీ అంగీకరించిందని రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి టి.హరీశ్‌రావు తెలిపారు. మంగళవారం ఢిల్లీలో జరిగిన పీఎంకేఎస్‌వై కార్యాచరణ రూపకల్పన తుది సమావేశంలో హరీశ్ పాల్గొన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన కొమరం భీం, గొల్లవాగు, రల్లివాగు, మత్తడివాగు, పెద్దవాగు (నీల్వాయి ప్రాజెక్టు), పెద్ద వాగు (జగన్నాథ్ ప్రాజెక్టు), పాలెం వాగు, ఎస్సారెస్పీ రెండో దశ, రాజీవ్ భీమా ఎత్తిపోతల, దేవాదుల ప్రాజెక్టులను పీఎంకేఎస్వైలో మొదటి ప్రాధాన్యత కింద, ఇందిరమ్మ వరద నీటి కాలువను రెండో ప్రాధాన్యత కింద చేర్చడానికి జలవనరులశాఖ సబ్ కమిటీ అంగీకరించిందని వివరించారు. ఈ ప్రాజెక్టుల నిర్మాణానికి ఏఐబీపీ ద్వారా రూ. 1,155 కోట్లు, నాబార్డు ద్వారా రూ. 2,825 కోట్లను రుణం రూపంలో ఇవ్వాలని కోరినట్లు చెప్పారు. మే 15 నాటికి మొదటి విడత నిధులు రాష్ట్రాలు ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తిచేసేందుకు వీలుగా మొదటి విడత నిధులను మే 15 నాటికి విడుదల చేయాలని కేంద్ర సబ్ కమిటీ సిఫారసు చేసినట్లు హరీశ్‌రావు తెలిపారు. ప్రాజెక్టులను పూర్తిచేయడానికి రాష్ట్రాలకు ఎఫ్ఆర్బీఎం పరిమితులతో సంబంధం లేకుండా నాబార్డు నుంచి రుణం పొందే అవకాశం ఇవ్వాలని సమావేశంలో నిర్ణయించినట్లు చెప్పారు. ప్రాజెక్టు కాలువల నిర్మాణానికి సంబంధించి మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం నిధుల్లో 40 శాతం నిధులనే సామగ్రి కోసం ఖర్చు చేసేందుకు ఇప్పటివరకు వీలుందని, దాన్ని 60 శాతానికి పెంచాలని ఈ సమావేశంలో నిర్ణయించినట్టు మంత్రి వివరించారు. కేంద్ర జలవనరుల కమిషన్ ప్రాంతీయ కార్యాలయాలను బలోపేతం చేయడం ద్వారా త్వరితగతిన ప్రాజెక్టుల నిర్మాణానికి సంబంధించిన అనుమతులు పొందే వీలుంటుందని సమావేశంలో చర్చించామన్నారు. లాతూరు పరిస్థితి రాకూడదనే... మహారాష్ట్రలోని లాతూరులో నెలకొన్న దుర్భిక్ష పరిస్థితులు తెలంగాణలో రాకూడదనే ముఖ్యమంత్రి కేసీఆర్ ‘మిషన్ కాకతీయ’ను రూపొందించారని హరీశ్‌రావు వివరించారు. ఈ పథకంలో భాగంగా 245 టీఎంసీల నీటిని చెరువుల్లో నిలుపుకొనే అవకాశం ఉందన్నారు. దేశవ్యాప్తంగా అందరి ప్రశంసలు అందుకుంటున్న ‘మిషన్ కాకతీయ’కు రూ. 5 వేల కోట్లు ఇవ్వాలని హైదరాబాద్ వచ్చిన నీతి ఆయోగ్ బృందాన్ని కోరామని, ఇందుకు నీతి ఆయోగ్ బృందం సానుకూలంగా స్పందించిందని మంత్రి తెలిపారు. ఈ సమావేశంలో మంత్రి హరీశ్‌రావుతోపాటు రాష్ట్ర ఆయకట్టు ప్రాంత అభివృద్ధి సంస్థ డెరైక్టర్ డాక్టర్ మల్సూర్ పాల్గొన్నారు. -
గడువులోగా పోలవరం పూర్తికాదు
కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి వెల్లడి సాక్షి, న్యూఢిల్లీ: పోలవరం ప్రాజెక్టు గడువులోగా పూర్తికాదని, గడువులోగా పూర్తి చేయడానికి కొన్ని సమస్యలు తలెత్తాయని కేంద్ర జల వనరుల శాఖ మంత్రి ఉమాభారతి చెప్పారు. పోలవరం పూర్తికి కొంత కాలపరిమితి పెంచాల్సి రావచ్చన్నారు. ప్రాజెక్టు నిర్మాణానికి అథారిటీని ఏర్పాటు చేశామని, అయితే గడువులోగా పూర్తి సమస్యలు ఉన్నాయని శనివారం విలేకరుల సమావేశ ంలో ఆమె చెప్పారు. పోలవరం పాజెక్టు పూర్తి కార్యాచరణ, ప్రణాళికలను చర్చించడానికి ఢిల్లీకి రావాల్సిందిగా ఏపీ సీఎం చంద్రబాబును కోరామని ఆమె తెలిపారు. ముఖ్యమంత్రితో చర్చించి ప్రాజెక్ట్‌కు కొత్త కాలపరిమితి నిర్ధారిస్తామన్నారు. ప్రాజెక్టుకు విధించిన గడువు దాటరాదన్నది తమ అభిమతమని, కానీ కొంతమేరకు సమయం పెంచాల్సి రావచ్చునని ఉమాభారతి వెల్లడించారు. ఇప్పుడు ప్రాజెక్టుకు నిధుల కొరత లేదన్నారు. ఈ ప్రాజెక్ట్‌కు ఇటీవలే రూ. 200 కోట్లు అందించామని, మొత్తం ఇప్పటికి రూ. 500 కోట్లు విడుదల చేశామని తెలిపారు. అయితే ఈ మొత్తం కేటాయింపులపై తనకు సంతృప్తిగా లేదని చెప్పారు. పోలవరం ప్రాజెక్ట్‌కు రూ. 1,600 కోట్లు విడుదల చేయాలని నీతి ఆయోగ్‌ను కోరామన్నారు. -
నాలుగూ ముఖ్యమే?
* కృష్ణా జలాల్లో తెలంగాణ సహా అన్ని రాష్ట్రాల వాదనలు వినాల్సిందే! * పునఃపంపకాలపై తెలంగాణ వినతిని సానుకూలంగా పరిగణించిన కేంద్ర జల వనరుల శాఖ * కేంద్ర మంత్రికి అధికారుల నివేదిక... అనంతరం కోర్టుకు అఫిడవిట్ * వచ్చే నెల 3న సుప్రీంకోర్టు ముందు వాదన సాక్షి, హైదరాబాద్: కృష్ణా నదీజలాల కేటాయింపు నాలుగు రాష్ట్రాలకూ సంబంధించిన అంశమే అని సుప్రీంకోర్టుకు చెప్పాలని కేంద్రం నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది. నదీజలాల వివాదంపై ఏర్పడిన బ్రజేశ్ కుమార్ ట్రిబ్యునల్ పరిధిపై ఏడాదిన్నరగా ఏటూ తేల్చక స్తబ్దుగా ఉన్న కేంద్రం ఆ వివాదాన్ని ముగించేలా పరిష్కారాన్ని కనుగొన్నట్టు సమాచారం. కర్ణాటక, మహారాష్ట్రతో పాటు, తెలంగాణ, ఏపీ రాష్ట్రాల వాదనలను ట్రిబ్యునల్ పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందనే విషయాన్ని వచ్చేనెల 3న జరుగనున్న విచారణ సందర్భంగా సుప్రీంకోర్టుకు నివేదించాలని పేర్కొంటూ కేంద్ర జల వనరుల శాఖ ఉన్నతాధికారులు సంబంధిత శాఖ మంత్రి ఉమాభారతికి నివేదిక సమర్పించినట్లుగా తెలుస్తోంది. దీనిపై కేంద్రమంత్రి తుది నిర్ణయం అనంతరం కేంద్రం కోర్టుకు అఫిడవిట్ సమర్పించే అవకాశం ఉంది. న్యాయశాఖ సలహా మేరకే.. కృష్ణా జలాల పునఃకేటాయింపులు జరపాలంటూ తెలంగాణ ప్రభుత్వం ఏడాది క్రితమే కేంద్రానికి విన్నవించుకున్నా ఇప్పటివరకు దానిపై స్పందించలేదు. కేంద్రం వైఖరితో విసుగు చెందిన రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ‘రాష్ట్ర పునర్ వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 89(ఎ), సెక్షన్(బి)లకు సంబంధించి ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులు, కొత్తగా ఏర్పడిన తెలంగాణ అవసరాలకు సంబంధించి, ప్రాజెక్టులకు నీటి కేటాయింపులను దృష్టిలో పెట్టుకుని కేంద్రం బ్రజేశ్‌కుమార్ ట్రిబ్యునల్‌కు స్పష్టమైన సూచనలు చేయలేదు.. ఈ దృష్ట్యా తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాలంటే కేంద్రం తన వైఖరిని స్పష్టం చేయాల్సి ఉంది’ అంటూ సుప్రీంకోర్టును అభ్యర్థించింది. దీనిపై గత నెలలో విచారణ జరిపిన సుప్రీం వారం రోజుల్లో తన వైఖరి ఏమిటో చెప్పాలని కేంద్రాన్ని ఆదేశించింది. దీంతో కదిలిన కేంద్ర జల వనరుల శాఖ న్యాయశాఖ సలహా కోరింది. వివాదాన్ని క్షుణ్నంగా అధ్యయనం చేసిన అనంతరం అటార్నీ జనరల్ నాలుగు రాష్ట్రాల వాదనలు వినాల్సిన అవసరాన్ని జల వనరుల శాఖకు నొక్కి చెప్పినట్టు తెలిసింది. కొత్త రాష్ట్రానికి అవకాశం లేకుంటే అన్యాయమే..? న్యాయ సలహాపై సమావేశమైన కేంద్ర జల వనరుల శాఖ బృందం ట్రిబ్యునల్ పరిధు లపై పలు దఫాలుగా చర్చలు జరిపినట్టు తెలిసింది. ట్రిబ్యునల్ తీర్పు ఎగువ రాష్ట్రాల వాదనకే మొగ్గుచూపిందని, నీటి లభ్యతను 75 శాతం నుంచి 65 శాతం మేర లెక్కించిందన్న తెలుగు రాష్ట్రాల వాదనపై ఎక్కువగా చర్చించినట్టు తెలుస్తోంది. నిజానికి మిగులు జలాలను ఆధారం చేసుకునే తెలంగాణ రాష్ట్రంలో పలు ప్రాజెక్టుల నిర్మాణం చేపడుతున్నారు. ప్రస్తుతం ఈ నీటిని ఎగువ రాష్ట్రాలకూ పంపిణీ చేయడంతో దిగువకు వచ్చే నీరు గణనీయంగా తగ్గిపోనుంది. దీనిపై కొత్త రాష్ట్రం వాదనలు వినిపించే అవకాశం ఇంతవరకూ రాలేదు. దీనిని సవరించాలంటే తెలంగాణ వాదనతో కలిపి మిగతా రాష్ట్రాల వాదనలు వినాలని, ఆ దిశగా ట్రిబ్యునల్‌కు సూచనలు చేయాల్సి ఉంటుందని ఉన్నతాధికారులు నిర్ణయించినట్లుగా చెబుతున్నారు. -
ఏపీ తీరునుబట్టే వాదనలు!
కృష్ణా జల వివాదాలపై నివేదికలతో రాష్ట్రం సిద్ధం ఏపీ అభ్యంతరాలకు దీటుగా వాదించాలని నిర్ణయం 18న ఢిల్లీలో కేంద్ర జలవనరులశాఖ ఆధ్వర్యంలో భేటీ సాక్షి, హైదరాబాద్ : కృష్ణా జలాల వివాదంపై కేంద్ర జల వనరుల శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 18న జరగనున్న సమావేశంలో ఆంధ్రప్రదేశ్ లేవనెత్తే అభ్యంతరాలను బట్టి అందుకు దీటుగా వ్యవహరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. తమంతట తాముగా ఏపీపై ఎలాంటి ఫిర్యాదులు చేయరాదని, కృష్ణా నీటి వినియోగం, కొత్త ప్రాజెక్టులు, వాటి పరిధి, నీటి వాటాలు తదితరాలపై ఏపీ ఏవైనా ఫిర్యాదులు చేస్తేమాత్రం అందుకు తగ్గట్లే తగిన గణాంకాలు, గత ట్రిబ్యునల్ ఆదేశాలు, నిర్ధిష్ట వాటాలు, సుప్రీంకోర్టు తీర్పులతో వివరణలు ఇవ్వాలని భావిస్తోంది. ఏపీతో వివాదాలున్న ప్రతి అంశంపై ఇప్పటికే తగిన నివేదికలతో సిద్ధమైన రాష్ట్రం, బోర్డు పరిధిలోకి తేవాల్సిన ప్రాజెక్టులపైనా తన కసరత్తును పూర్తి చేసింది. ఏపీ లేవనెత్తుతున్న పలు అభ్యంతరాలకు సమాధానాలు సిద్ధం చేయడంపై మంగళవారం ప్రభుత్వ సలహాదారు విద్యాసాగర్‌రావు, నీటి పారుదల శాఖ కార్యదర్శి ఎస్కే జోషి, ఇతర అధికారులు సచివాలయంలో సమావేశమై కసరత్తు చేశారు. ఏపీ అభ్యంతరాలు, వాదనలకు దీటుగా అన్ని ఆధారాలతో గట్టిగా తమ వాణిని వినిపించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు.