కృష్ణా జల వివాదాలపై నివేదికలతో రాష్ట్రం సిద్ధం
ఏపీ అభ్యంతరాలకు దీటుగా వాదించాలని నిర్ణయం
18న ఢిల్లీలో కేంద్ర జలవనరులశాఖ ఆధ్వర్యంలో భేటీ
సాక్షి, హైదరాబాద్ : కృష్ణా జలాల వివాదంపై కేంద్ర జల వనరుల శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 18న జరగనున్న సమావేశంలో ఆంధ్రప్రదేశ్ లేవనెత్తే అభ్యంతరాలను బట్టి అందుకు దీటుగా వ్యవహరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. తమంతట తాముగా ఏపీపై ఎలాంటి ఫిర్యాదులు చేయరాదని, కృష్ణా నీటి వినియోగం, కొత్త ప్రాజెక్టులు, వాటి పరిధి, నీటి వాటాలు తదితరాలపై ఏపీ ఏవైనా ఫిర్యాదులు చేస్తేమాత్రం అందుకు తగ్గట్లే తగిన గణాంకాలు, గత ట్రిబ్యునల్ ఆదేశాలు, నిర్ధిష్ట వాటాలు, సుప్రీంకోర్టు తీర్పులతో వివరణలు ఇవ్వాలని భావిస్తోంది.
ఏపీతో వివాదాలున్న ప్రతి అంశంపై ఇప్పటికే తగిన నివేదికలతో సిద్ధమైన రాష్ట్రం, బోర్డు పరిధిలోకి తేవాల్సిన ప్రాజెక్టులపైనా తన కసరత్తును పూర్తి చేసింది. ఏపీ లేవనెత్తుతున్న పలు అభ్యంతరాలకు సమాధానాలు సిద్ధం చేయడంపై మంగళవారం ప్రభుత్వ సలహాదారు విద్యాసాగర్‌రావు, నీటి పారుదల శాఖ కార్యదర్శి ఎస్‌కే జోషి, ఇతర అధికారులు సచివాలయంలో సమావేశమై కసరత్తు చేశారు. ఏపీ అభ్యంతరాలు, వాదనలకు దీటుగా అన్ని ఆధారాలతో గట్టిగా తమ వాణిని వినిపించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు.
ఏపీ తీరునుబట్టే వాదనలు!
Published Wed, Jun 17 2015 2:07 AM | Last Updated on Sun, Sep 2 2018 5:24 PM
Advertisement