సాక్షి, హైదరాబాద్: ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 26న ఫీజువద్ద మహాధర్నా నిర్వహించాలని భారతీయ జనతా యువమోర్చా నిర్ణయించింది. శనివారం బీజేపీ కార్యాలయంలో జరిగిన పదాధికారుల సమావేశంలో ఈ నిర్ణ యం తీసుకున్నారు.
ప్రస్తుత విద్యా సంవత్సరం మొదలై 6 నెలలు గడిచినా ఫీజు బకాయిల నిధులు విడుదల చేయకపోవడం దారుణమని బీజేపీ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర మోర్చా ఇన్‌చార్జి దుగ్యాల ప్రదీప్‌కుమార్ విమర్శించారు. బకాయిలు చెల్లించకపోవడంతో ప్రైవేటు యాజమాన్యా లు విద్యాసంస్థలను నడపలేకపోతున్నాయన్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలు చెల్లించాలని బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు పి.విక్రంరెడ్డి కోరారు. సమావే శంలో యువమోర్చా నేతలు బద్దం మహిపాల్‌రెడ్డి, గుండగోని భరత్‌గౌడ్ పాల్గొన్నారు.
26న యువమోర్చా మహాధర్నా
Published Sun, Oct 23 2016 3:29 AM | Last Updated on Mon, Oct 1 2018 5:40 PM
Advertisement