ఇదో పెద్ద కుంభకోణం: విష్ణుకుమార్
సాక్షి, హైదరాబాద్: వైజాగ్‌లో ఉన్న బ్రాండిక్స్ దుస్తుల తయారీ పరిశ్రమలో పనిచేస్తున్న 18 వేల మంది కార్మికుల పొట్టగొట్టడానికి కార్మిక శాఖ సహకరించిందని, కార్మికుల కనీస వేతనాలను నిర్థారిస్తూ ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్‌లో పేర్కొన్న వేతనాలు.. ప్రభుత్వం జారీ చేసిన జీవో-362లో లేవని, వేతనాలను తగ్గించి జీవో ఇచ్చారని బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్‌రాజు ఆరోపించారు.
ఫలితంగా 2011 నుంచి ఏటా రూ.72 కోట్ల చొప్పున ఐదేళ్లలో కార్మికులు రూ.360 కోట్లు నష్టపోయారని, ఇదో పెద్ద కుంభకోణమని, అప్పటి, ఇప్పటి ప్రభుత్వంలో ఉన్న వారికి ముడుపులు అందడం వల్లే మౌనం వహిస్తున్నారని, కుంభకోణంపై సమగ్ర దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు.