హైదరాబాద్ లో వరుస చోరీలతో బెంబేలెత్తించిన దొంగలు. మూడుగంటల్లో 11 తులాల బంగారం మాయం.
ఒక వైపు హైదరాబాద్ నగరం నిమజ్జనంలో బిజీగా ఉంటే... మరో వైపు దొంగలు అదును చూసి.. చేతి వాటం ప్రదర్శిస్తున్నారు. వరస చోరీలతో జనాన్ని బెంబేలెత్తించారు. పట్టపగలు ముషీరాబాద్, కాచిగూడ, నల్లకుంటల్లో చైన్ స్నాచింగ్ లకు పాల్పడ్డారు. మూడు గంటల్లో 11 తెలాల బంగారాన్ని అపహరించారు.