తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు ప్రసాదాలను హైదరాబాద్లో విక్రయించనున్నారు.
కాచిగూడ: తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు ప్రసాదాలను హైదరాబాద్లో విక్రయించనున్నారు. ఈనెల 8వ తేదీన హిమాయత్‌నగర్ లిబర్టీ వద్ద ఉన్న టీటీడీ తిరునిలయంలో విక్రయిస్తామని హైదరాబాద్ శాఖ జేఈవో రమేష్ శుక్రవారం తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విక్రయించనున్నారు. ప్రతి నెల రెండో ఆదివారం లడ్డూల అమ్మకం ఉంటుందని ఆయన తెలిపారు.