నేడు మహా శివరాత్రి, శైవక్షేత్రాల్లో కొనసాగుతున్న రద్దీ.. గోదావరిపై నిర్మించనున్న ప్రాజెక్టులపై మహారాష్ట్రతో ఒప్పందాలకోసం నేడు ముంబై వెళ్లనున్న సీఎం కేసీఆర్..
మహాశివరాత్రి: నేడు మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ శైవక్షేత్రాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తెల్లవారుజాము నుంచే పరమశివుని దర్శనం కోసం భక్తులు బారులుతీరారు. వేములవాడ రాజన్న, శ్రీశైలం మల్లన్న, కాళహస్తీశ్వర ఆలయాల్లో విపరీతమైన రద్దీ కొనసాగుతోంది.
ముంబైకి కేసీఆర్: గోదావరి నదిపై తెలంగాణ ప్రభుత్వం నిర్మించతలపెట్టిన ఐదు బ్యారేజీల విషయంలో ఎగువ రాష్ట్రమైన మహారాష్ట్రతో కీలక ఒప్పందాలు కుదుర్చుకునేందుకు సీఎం కేసీఆర్ నేడు ముంబై వెళ్లనున్నారు. ఆయన వెంట నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్ రావు, ఇతర ఉన్నతాధికారులూ వెళతారు.
ఏడుపాయల జాతర: మెదక్ జిల్లాలో ప్రసిద్ధిగాంచిన ఏడుపాయలలో నేటి నుంచి జాతర ప్రారంభంకానుంది. సుమారు 15 లక్షల మంది భక్తులు వచ్చే ఈ జాతర మూడు రోజులపాటు కొనసాగనుంది.
స్టాక్స్ క్లోజ్: మహాశివరాత్రి పండుగ సందర్భంగా నేడు స్టాక్ మార్కెట్లకు సెలవు