- భవిష్యత్ కార్యాచరణపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం
- సమావేశంలో పాల్గొననున్న సుప్రీం న్యాయవాది వైద్యనాథన్
- ఈ అంశంపై సీఎంతో చర్చించిన మంత్రి హరీశ్‌రావు
సాక్షి, హైదరాబాద్: కృష్ణా జలాలపై బ్రజేశ్ కుమార్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పు విషయం లో అనుసరించాల్సిన భవిష్యత్ న్యాయ కార్యాచరణ గురించి చర్చించేందుకు నీటిపారుదల మంత్రి హరీశ్‌రావు నేతృత్వంలోని కేబినెట్ సబ్ కమిటీ శనివారం సచివాయంలో భేటీ కానుంది. సబ్ కమిటీ సభ్యులైన కడియం శ్రీహరి, పోచార ం శ్రీనివాస్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వర్‌రావు, జగదీశ్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ సలహాదారు విద్యాసాగర్‌రావు, నీటిపారుదల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎస్‌కే జోషీ, ఈఎన్‌సీ మురళీధర్‌తోపాటు సుప్రీంకోర్టు న్యాయవాది వైద్యనాథన్, అడిషనల్ అడ్వొకేట్ జనరల్ రామ్‌చందర్‌రావులు ఈ సమావేశానికి హాజరుకానున్నారు.
ట్రిబ్యునల్ తీర్పుతో రాష్ట్రంపై పడే ప్రభావం, భవిష్యత్ కార్యాచరణపై భేటీలో చ ర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకే ట్రిబ్యునల్ విచారణ పరిమితమైతే తెలంగాణకు ఎనలేని నష్టం జరిగే అవకాశాల దృష్ట్యా, దీన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్లడమే ఉత్తమమని ప్రభుత్వానికి ఓవైపు సూచనలు అందుతుండగా తీర్పు వెలువడ్డాక సుప్రీంకు వెళ్లి చేసేదేమీ లేదని మరోవైపు నుంచి వాదన వినిపిస్తోంది. దీనిపై ఇప్పటికే ఓసారి చర్చించిన కమిటీ...వైద్యనాథన్ సలహా మేరకే ముందుకెళ్లాలని నిర్ణయించింది. ఇదే విషయమై మంత్రి హరీశ్ శుక్రవారం సీఎం కేసీఆర్‌తో చర్చించినట్లు తెలిసింది. మరోవైపు ఎస్‌కే జోషి, ప్రభుత్వ సలహాదారు విద్యాసాగర్‌రావు అధికారులతో సమావేశమై వైద్యనాథన్ ముందుంచాల్సిన అంశాలపై చర్చిం చారు. ఇదే విషయమై రిటైర్డ్ ఇంజనీర్ల ఫోరం సైతం ప్రత్యేకంగా సమావేశమైంది. ట్రిబ్యునల్ తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్లడమే రాష్ట్రం ముందున్న మార్గమని, ఇదే నిర్ణయాన్ని ప్రభుత్వానికి చెప్పాలని నిర్ణయించినట్లు తెలిసింది.
‘కృష్ణా’పై నేడు సబ్ కమిటీ భేటీ
Published Sat, Oct 29 2016 2:30 AM | Last Updated on Tue, Aug 14 2018 10:54 AM
Advertisement