నగరంలోని బోయిన్‌పల్లి వద్ద ఓ లారీ బుధవారం ఉదయం బోల్తా పడింది.
హైదరాబాద్: నగరంలోని బోయిన్‌పల్లి వద్ద ఓ లారీ బుధవారం ఉదయం బోల్తా పడింది. ఈనాడు ప్రింటింగ్ ప్రెస్‌కు మెటీరియల్ తీసుకెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో లారీ డ్రైవర్‌కు గాయాలయ్యాయి. కాగా ఉదయం నుంచి ఆ మార్గంలో భారీగా వాహనాలు నిలిచి పోయాయి. పోలీసులు క్రేన్‌తో లారీని అడ్డు తీయడానికి రెండు గంటలకు పైగా సమయం తీసుకోవడంతో అప్పటి వరకు ట్రాఫిక్ జామ్ తో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు.