క్రీజీ డాలర్ ....... | Two hands make software | Sakshi
Sakshi News home page

క్రీజీ డాలర్ .......

Published Tue, Sep 3 2013 12:34 AM | Last Updated on Mon, Oct 22 2018 7:42 PM

Two hands make software

సైబర్‌సిటీ, న్యూస్‌లైన్: డాలరుతో రూపాయి మారకం విలువ పడిపోవటంతో దేశంలో అన్నిర ంగాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కానీ ఈ పరిణామం సాఫ్ట్‌వేర్ ఉద్యోగులకు మాత్రం కాసులు కురిపిస్తోంది. రూపాయి విలువ పడిపోవటంతో యూఎస్, యూకే వంటి విదేశాల్లో పనిచేసే ప్రవాసాంధ్రులు స్వదేశానికి డబ్బులు పంపించి పెద్ద మొత్తంలో డబ్బు జమ చేసుకుంటున్నారు.

స్వదేశంలో పనిచేసే   ఉద్యోగులూ డాలర్ విలువ పెరగడాన్ని తమకు  అనుకూలంగా మలుచుకుంటున్నారు. మరీ ముఖ్యంగా సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు ఈ పరిణామాన్ని ‘క్యాష్’ చేసుకుంటున్నారు. హైదరాబాద్‌లోనే ఉండి విదేశీ కంపెనీలకు చెందిన ప్రాజెక్ట్ వర్క్స్, కంపెనీ వెబ్‌సైట్‌లను డిజైన్ చేయటం వంటి పార్ట్‌టైం ఉద్యోగాలను చేస్తూ పెద్ద మొత్తంలో అర్జిస్తున్నారు. ఈ ‘ఫ్రీలాన్స్ జాబ్స్’ కథాకమామీషుపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం.
 
రూపాయితో పోలిస్తే డాలర్ విలువ ఎక్కువగా ఉండటంతో విదేశాలకు వెళ్లి సంపాదించుకోవాలనే ఆశ ప్రతీ ఒక్కరికీ ఉంటుంది. కానీ, ఇప్పటికిప్పుడు విదేశాలకు వెళ్లాలంటే అంత సులువేం కాదు. అంతేకాకుండా విదేశీ ప్రయాణం, వీసా నిబంధనలను ప్రభుత్వం కఠినతరం చేసింది కూడా. అందుకే హైదరాబాద్‌లోనే ఉంటూ విదేశీ కంపెనీల్లో పనిచేసే ఫ్రీలాన్స్ ఉద్యోగాల వైపు సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు ఆసక్తి చూపిస్తున్నారు. వాస్తవారికి వీరికి వారంలో ఐదు రోజులే ఉద్యోగం. దాంతో వీకెండ్స్‌లో, రాత్రి సమయాల్లో ఈ ఫ్రీలాన్స్ జాబ్స్ చేస్తున్నారు. రెండు చేతులా సంపాదిస్తున్నారు. కేవలం డబ్బు సంపాదన కోసమే కాకుండా రకరకాల ప్రాజెక్ట్స్ చేస్తుండటంతో అనుభవం కూడా వస్తుండటం కలిసొచ్చే అంశంగా మారింది.
 
రా.. రమ్మంటున్న విదేశీ కంపెనీలు

 ‘ఫ్రీలాన్స్ జాబ్స్ చేయండి మహాప్రభో’ అని సాఫ్ట్‌వేర్ ఉద్యోగులను వల వేసి పడుతున్నాయి విదేశీ కంపెనీలు. ఎందుకంటే.. యూఎస్, యూకే వంటి విదేశాల్లో కంపెనీ వెబ్‌సైట్ క్రియేట్ చేసుకోవాలంటే మామూలు విషయం కాదు. చాలా పెద్ద కొటేషన్ ఉంటుంది. పెద్ద మొత్తంలో ఖర్చవుతుంది కూడా. అంతేకాకుండా ప్రస్తుతం డాలర్ విలువ పెరగడంతో విదేశాల్లో కంపెనీ ఉద్యోగులకు వేతనాలు ఇవ్వాలంటే కత్తిమీద సామవుతోంది. అందుకే రూపాయి విలువ పడిపోవటంతో మెట్రో నగరాల్లోని సాఫ్ట్‌వేర్ ఉద్యోగులతో ఆయా కంపెనీ వెబ్‌సైట్‌లను క్రియేట్ చేయించుకొని ఎంతోకొంత ముట్టజెప్పుతున్నారు. దీంతో అటు విదేశీ కంపెనీలకు డబ్బు ఆదా అవుతుంది. ఇటు సాఫ్ట్‌వేర్ ఉద్యోగులకూ ఆదాయం లభిస్తుంది.

 ఇలా వెతకండి..
 ఇంటర్నెట్ సహాయంతో గూగుల్‌లోకి వెళ్లి ‘ఫ్రీలాన్స్ జాబ్స్’ అని టైప్ చేయగానే విదేశీ కంపెనీలకు చెందిన వేల జాబ్ వెబ్‌సైట్లు దర్శనమిస్తాయి. వీటిలో మన సామర్థ్యానికి తగినవి, సమయానికి చేయదగినవి ఎంచుకోవాలి. ఆ తర్వాత ఆయా కంపెనీ ఈ-మెయిల్ ఐడీకి రెజ్యూమ్‌ను పంపించాలి. ఇంటర్య్వూ కోసం సమయాన్ని నిర్ణయించుకోవాలి. ఆ తర్వాత వెబ్‌కామ్ సహాయంతో కంపెనీ ప్రతినిధులు అభ్యర్థులతో ఇంటర్య్వూ నిర్వహిస్తారు. సెలెక్ట్ అయ్యాక విదేశీ కంపెనీ నిబంధనల ప్రకారం అగ్రిమెంట్ చేయిస్తారు. ఉదాహరణకు టెక్నాలజీ డాట్ నెట్‌లో ‘ఈ-కామర్స్’ ప్రాజెక్ట్ చేస్తే వారానికి 300 డాలర్లు సంపాదించుకోవచ్చు. అంటే మన కరెన్సీలో 19,800 రూపాయలన్నమాట. (సోమవారం డాలర్ మార కం విలువ 66.00 రూపాయలు)

 అంతా ‘పేపాల్’ లోనే..
 ఇదంతా బాగానే ఉంది. ప్రాజెక్ట్స్ పూర్తి చేశాక డబ్బు ఎలా వస్తుందనే అనేగా మీ అనుమానం. ఫ్రీలాన్స్ జాబ్స్ చేసే ఉద్యోగులకు ఆయా కంపెనీలు ‘పేపాల్’ ఖాతాను తెరిచి ఇస్తుంది. నగదు చెల్లింపులన్నీ దీని ద్వారానే జరుగుతాయి. పేపాల్ అనేది విశ్వవ్యాప్తంగా ఈ-కామర్స్ బిజినెస్ చేసే ఆన్‌లైన్ సంస్థ. దీని ద్వారా చెక్‌లు, మనియార్డర్లు వంటి వాటితో సంబంధం లేకుండా ఇంటర్నెట్ ద్వారానే నగదు బదిలీ, చెల్లింపులు వంటివి జరుగుతాయి. పేపాల్ ఖాతా రాగానే ముందుగా మన బ్యాంక్ అకౌంట్ నంబర్‌ను ఇందులో రిజిస్టర్ చేసుకోవాలి. ప్రాజెక్ట్‌ను పూర్తి చేశాక ముందుగా కంపెనీ ప్రతినిధులతో మాట్లాడుకున్న విధంగా.. సంబంధిత సొమ్మును డాలర్ల రూపంలో మన పేపాల్ ఖాతాలో వేస్తారు. పేపాల్ ఈ డాలర్లను రూపాయిల్లోకి మార్చుతుంది. ఇందుకు కొంత చార్జీ చేస్తారు. డాలర్ విలువను బట్టి చెల్లించే మొత్తంలో కమీషన్ ఉంటుందన్నమాట. వాటిని విత్‌డ్రా చేసుకుని మన బ్యాంకు ఖాతాలోకి వేసుకోవచ్చు.
 
 తీసుకోవాల్సిన జాగ్రత్తలివీ...    
 నెట్‌లో ఫ్రీలాన్స్ జాబ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.
     
 రిజిస్టర్డ్ కంపెనీలు, తెలిసిన ప్రాజెక్ట్‌లనే ఎంచుకోవాలి.
 
 కన్సల్టెన్సీ పూర్వపరాలు, ప్రాజెక్ట్ వివరాలు తెలుసుకుని అగ్రిమెంట్ చేసుకోవాలి.
     
 ఇంటర్వ్యూ సమయంలో బ్యాంక్ అకౌంట్ నెంబరు, అడ్రస్ ప్రూఫ్ వంటివి ఇవ్వరాదు.
 
 ప్రాజెక్ట్ పూర్తికాగానే చెక్ ఇస్తాం అనో, బ్యాంక్‌లో డిపాజిట్ చేస్తామనో అంటే అంగీకరించకూడదు.
 
 సంబంధిత కంపెనీయే పేపాల్ అకౌంట్‌ను తెరిచి ఇవ్వాలి. లేకపోతే ఆయా కంపెనీలను న మ్మకూడదు.
 
 పేపాల్ అకౌంట్ ద్వారా మాత్రమే డబ్బులు డిపాజిట్ అవుతాయో లేదో ముందుగానే అడిగి తెలుసుకోవాలి.
     
 అగ్రిమెంట్‌లో అనుకున్న సమయానికి ప్రాజెక్ట్ పూర్తి చేయకపోతే కంపెనీతో మాట్లాడి సమయాన్ని పొడిగించుకోవాలి.
     
 లేకపోతే అగ్రిమెంట్ రద్దు అవుతుంది. డబ్బులు కూడా రావు. మళ్లీ అదే కంపెనీలో అవకాశాలు రావు.
 
 సాంకేతిక నైపుణ్యం మెరుగవుతుంది
 ఫ్రీలాన్స్ జాబ్స్‌తో కేవలం డబ్బు సంపాదనే కాకుండా సాంకేతిక నైపుణ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు కూడా. రకరకాల ప్రాజె క్టులు చేయడం వల్ల సాంకేతిక నైపుణ్యం పెరుగుతుంది. ఏడాది కాలం నుంచి వీకెండ్స్, ఖాళీ సమయాల్లో ఫ్రీలాన్స్ జాబ్స్ చేస్తున్నా. రోజులో కనీసం 4 నుంచి 5 గంటలు కేటాయిస్తున్నా. ప్రాజెక్ట్‌ను బట్టి నాకు రూ. 10 వేల నుంచి రూ. 15 వేలు వస్తున్నాయి.    
 - సురేష్, సిస్టమ్ అనాలసిస్ట్
 
 నెలకు రూ.15 వేలు సంపాదిస్తున్నా
 ఇటీవలే ఈ ఫ్రీలాన్స్ జాబ్ మొదలుపెట్టాను. రెగ్యులర్ జాబ్ టెన్షన్ మూలంగా వీకెండ్‌లో కేవలం 5 గంటలు మాత్రమే కేటాయించగలుగుతున్నా. అయినా నెలకు రూ. 15 వేలు వ స్తున్నాయి. ఐటీ ఉద్యోగుల్లో ఫ్రెషర్స్‌కు ఇది మంచి అవకాశమని చెప్పాలి. వీకెండ్స్, ఖాళీ సమయాలను వృథా చేసుకోకుండా ఈ జాబ్స్ చేస్తే డబ్బు, అనుభవం కూడా లభిస్తుంది.
 - హనుమంతు, సీనియర్ ప్రోగ్రామర్
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement