హైదరాబాద్ మాదాపూర్ ఇనార్బిట్ మాల్ వద్ద శనివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మహిళలు మృతి చెందారు.
హైదరాబాద్ : మాదాపూర్ లోని ఇనార్బిట్ మాల్ వద్ద శనివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మహిళలు మృతి చెందారు. తెల్లవారుజామున రోడ్డు దాటుతున్న భాగ్యమ్మ(40), సరోజనమ్మ(55)ను వ్యాన్ ఢీకొంది. దీంతో వారు అక్కడిక్కడే మరణించారు. ఈ ఇద్దరు మహిళలు బోరబండలో నివాసం ఉంటూ ఇనార్బిట్ మాల్‌లోని ఓ క్యాంటిన్‌లో పని చేస్తున్నారు.
మృతుల స్వస్థలం మహబూబ్‌నగర్ జిల్లా అని తెలిసింది. వారి మృతితో కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.