![పోలీసుల అదుపులో వర్థమాన నటుడు - Sakshi](/styles/webp/s3/article_images/2017/09/3/61458829623_625x300.jpg.webp?itok=cHkrypzD)
పోలీసుల అదుపులో వర్థమాన నటుడు
హైదరాబాద్ : వర్థమాన నటుడు, 'ఫేస్బుక్' చిత్రం హీరో నండూరి ఉదయ్ కిరణ్ అలియాస్ బాబీ గత రాత్రి దసపల్లా హోటల్లో హల్ చల్ చేశాడు. మద్యం సేవించిన అతడు అక్కడ సిబ్బందిపై దాడి చేసి, హోటల్ అద్దాలు ధ్వంసం చేశాడు. అంతేకాకుండా మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. హోటల్ యాజమాన్యం ఫిర్యాదుతో ఉదయ్కిరణ్ ను జూబ్లీహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా గతంలో ఉదయ్ కిరణ్ డ్రగ్స్ సరఫరా చేస్తూ పోలీసులకు చిక్కడం అప్పట్లో కలకలం రేపిన విషయం తెలిసిందే.
కాగా తనపై వచ్చిన ఆరోపణలను ఉదయ్ కిరణ్ కొట్టిపారేశాడు. తాను ఎవరిపైనా దాడి చేయలేదని, తనపై వచ్చిన ఆరోపణలు అవాస్తవమని తెలిపాడు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.