గాంధీ ఆస్పత్రిలో అరుదైన శస్త్రచికిత్స
హైదరాబాద్: వరిబీజం శస్త్రచికిత్స నిర్వహిస్తున్న క్రమంలో ఓ పురుషుని కడుపులో గర్భసంచి, పిండాలను పోలి న రెండు భాగాలు కనిపించడంతో వైద్యులు విస్తుపోయారు. ఈ ఘటన సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో చోటు చేసుకుంది. ఈ వివరాలను వైద్యులు జగదీశ్, రచ్చరఘు, రమేశ్‌లు మీడియాకు వివరించారు. యాదాద్రి జిల్లా మోత్కూరు ప్రాంతవాసి సోమయ్య (37) (పేరు మార్చాం) హెర్నియా శస్త్రచికిత్స కోసం గతనెల 23న గాంధీలో చేరాడు. వైద్య పరీక్షలు నిర్వహించి శుక్రవారం ఆపరేషన్ చేసి హెర్నియాను తొలగిస్తున్న క్రమంలో అతని కడుపులో గర్భసంచిని గుర్తించారు.
వృషణనాళ సంచిలో ఉండాల్సిన వృషణా లు లేవు. హెర్నియాశాకడ్‌లో ఉండాల్సిన ఇంగ్వెనల్ కెనాల్ అనే గొట్టపు నిర్మాణం పూర్తిస్థారుులో తయారుకాలేదు. శస్త్రచికిత్స చేస్తున్న వైద్యుడు రఘు సమాచారం మేరకు యూరాలజీ విభాగ హెచ్‌ఓడీ, యాండ్రాలజిస్ట్ ప్రొఫెసర్ జగదీశ్ రోగిని పరీక్షించారు. మహిళల మాదిరి గర్భసంచి, పిండాలను పోలిన భాగాలు పురుషుల్లో ఉండడం వైద్య పరిభాషలో ట్రూహెర్నాఫ్రోడిటీగా అభివర్ణించారు. రోగి శరీర భాగాల ను సేకరించి క్యారియోటైప్ పరీక్షకు పంపించామని, నివేదిక ఆధారంగా మరోమారు శస్త్రచికిత్స చేసి ఆ భాగాలను తొలగిస్తామన్నారు.
పురుషుడి కడుపులో గర్భసంచి!
Published Sat, Dec 3 2016 2:24 AM | Last Updated on Tue, Oct 9 2018 7:52 PM
Advertisement
Advertisement