అక్రమ కేసులు ఉపసంహరించుకోవాలి | Uttam letter to KCR | Sakshi
Sakshi News home page

అక్రమ కేసులు ఉపసంహరించుకోవాలి

Jul 18 2017 1:56 AM | Updated on Sep 19 2019 8:44 PM

అక్రమ కేసులు ఉపసంహరించుకోవాలి - Sakshi

అక్రమ కేసులు ఉపసంహరించుకోవాలి

వరంగల్‌ డీసీసీ అధ్య క్షుడు రాజేందర్‌రెడ్డి, మరో ఇద్దరు కాంగ్రెస్‌ నేతలపై పెట్టిన తప్పు డు కేసులను వెంటనే ఉపసంహరించు కోవాలని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి డిమాండ్‌ చేశారు.

కేసీఆర్‌కు ఉత్తమ్‌ లేఖ
సాక్షి, హైదరాబాద్‌: వరంగల్‌ డీసీసీ అధ్య క్షుడు రాజేందర్‌రెడ్డి, మరో ఇద్దరు కాంగ్రెస్‌ నేతలపై పెట్టిన తప్పు డు కేసులను వెంటనే ఉపసంహరించు కోవాలని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. వరంగల్‌లో ఇటీవల జరిగిన టీఆర్‌ఎస్‌ నేత హత్య కేసులో కాంగ్రెస్‌ నాయకులను పోలీసులు అన్యాయంగా ఇరికించారని సోమవారం సీఎం కేసీఆర్‌కు రాసిన బహిరంగ లేఖలో ఆరోపించారు.

ఇటీవలే కుమారుడి మృతి తో పుత్రశోకంలో ఉన్న రాజేందర్‌రెడ్డిపై ఇలాంటి అక్రమ కేసులు పెట్టడం ఏంటని ప్రశ్నించారు. ప్రతిపక్ష నేతలను వేధించా లనే అప్రజాస్వామిక ఆలోచనల ను మానుకోవాలని సూచించారు. మరోవైపు టీఆర్‌ఎస్‌ నేతల ప్రోద్బలంతోనే రాజేం దర్‌రెడ్డిపై పోలీసులు అక్రమ కేసులు పెట్టారని పలువురు డీసీసీ అధ్యక్షులు ఆరోపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement