స్వార్థ రాజకీయాలకు ‘బంగారు’ ముసుగు
రాజ్యసభ సభ్యుడు వీహెచ్
సాక్షి, హైదరాబాద్: స్వార్థ రాజకీయాల కోసం పార్టీ మారుతున్నవారంతా బంగారు తెలంగాణ అంటూ ముసుగు వేసుకుంటున్నారని ఏఐసీసీ కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు విమర్శించారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ బంగారు తెలంగాణ అంటూ ఈ రెండేళ్లలో సీఎం కేసీఆర్ చేసిందేమీ లేదన్నారు.
తాగండి, తినండి, పనిచేయకండి అనే రీతిలో ప్రభుత్వం పనితీరు ఉందన్నారు. ఖజానా నింపుకోవడానికి మద్యం అమ్మకాలను విస్తృతం చేశారన్నారు. కేసీఆర్ వాగ్దానాలు, వైఫల్యాలపై రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేస్తానన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో పదవుల నుంచి తప్పుకుంటానన్న జానారెడ్డి ప్రకటనతో కార్యకర్తలు ఐధైర్యపడతారన్నారు.