బంగారు తెలంగాణ అంటే ఇదేనా ?
- ఇది ముమ్మాటికీ రాజకీయ దుశ్చర్య
- గిరిజన మంత్రి ఇలాకాలో గిరిజనుడికి అన్యాయం
- కాంగ్రెస్ నాయకుడు రాజునాయక్ కుటుంబానికి మాజీ మంత్రులు, ఎమ్మెల్యే దొంతి పరామర్శ
ములుగు : కాంగ్రెస్ నాయకుడు పోరిక రాజునాయక్ ఇంటిని ఏకపక్షంగా కూల్చివేయడం ముమ్మాటికీ రాజకీయ దుశ్చర్య అని, కేసీఆర్ కలలు కంటున్న బంగారు తెలంగాణ అంటే కాంగ్రెస్ నేతలను ఇబ్బందులకు గురిచేయడమేనా అని మాజీ కేంద్ర మంత్రి పోరిక బలరాంనాయక్, మాజీ మంత్రి బస్వరాజు సారయ్య, నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మండిపడ్డారు. శనివారం సహకార సంఘం అధికారులు కూల్చివేసిన రాజునాయక్ ఇంటిని, కుటుంబ సభ్యులను కాంగ్రెస్ నాయకులు పరిశీలించారు.
సంఘటన స్థలం నుంచి జిల్లా కలెక్టర్‌తో ఫోన్‌లో మాట్లాడారు. ఇల్లు కూల్చివేత విషయం కలెక్టర్‌ను అడగగా తనకు తెలియదని సమాధానం ఇచ్చినట్లు నేతలు తెలిపారు. గిరిజనశాఖ మంత్రి అజ్మీరా చందూలాల్ ఇలాఖాలో ఓ గిరిజనుడికి అన్యాయం జరగడం విచారకరమన్నారు. అక్రమంగా ప్రభుత్వ భూమిలో ఇల్లు కట్టుకున్నట్లు నిర్ధారణ అయితే ప్రభుత్వం జారీ చేసిన జీఓ నం.58, 59 ప్రకారం ఎందుకు సాయం చేయలేదని ప్రశ్నించారు. గతంలో గిరిజనశాఖ మంత్రి చందూలాల్‌తో జరిగిన వివాదం కారణంగా ప్రస్తుతం ఇలా కక్ష తీర్చుకున్నట్లు తమ దృష్టికి వచ్చినట్లు తెలిపారు. వారివెంట మాజీ ఎమ్మెల్యే పోదెం వీరయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి మస్రగాని వినయ్‌కుమార్, వెంకటాపురం జెడ్పీటీసీ బానోతు విజయ, మాజీ ఎంపీపీ నల్లెల్ల కుమారస్వామి, టీ ఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు కొండెం రవీందర్‌రెడ్డి, ప్రచార కార్యద ర్శి అహ్మద్‌పాషా, ఎస్టీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య మురళీ, బాబీ, అశోక్ ఉన్నారు.