సినీ పరిశ్రమను కించపరచడం సరికాదు
బంజారాహిల్స్‌లోని కేబీఆర్ పార్కు వద్ద ఆదివారం కళామందిర్ ఫౌండే షన్ ఆధ్వర్యంలో ‘సే నో టు డ్రగ్స్’పేరుతో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనికి వెంకయ్యనాయుడుతో పాటు ఏపీ మంత్రి కామినేని శ్రీనివాస్, ఖైరతాబాద్ ఎమ్మెల్యే చింతల రాంచంద్రారెడ్డి, వనజీవి రామయ్య, ఆబ్కారీ శాఖ కమిషనర్ చంద్ర వదన్, డైరెక్టర్ అకున్ సబర్వాల్, జీవిత, రాజశేఖర్, గిరిబాబు, మా అధ్యక్షుడు శివాజీ రాజా, కార్యదర్శి నరేశ్, పరుచూరి వెంకటేశ్వరరావు, గోపాలకృష్ణ, కళామందిర్ ఫౌండేషన్ నిర్వాహకుడు కల్యాణ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకయ్య మాట్లాడుతూ... డ్రగ్స్ సమాజాన్ని పీడిస్తున్న ప్రధాన సమస్య అని ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై ప్రతి ఒక్కరూ పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో భాగంగా కేబీఆర్ పార్కు నుంచి జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు వరకు వాక్ నిర్వహించారు.