రోహిత్ ఆత్మహత్య: లీవ్‌లో హెచ్‌సీయూ వీసీ | vipin sriVAsthav as Incharge VC to HCU | Sakshi
Sakshi News home page

రోహిత్ ఆత్మహత్య: లీవ్‌లో హెచ్‌సీయూ వీసీ

Published Sun, Jan 24 2016 5:16 PM | Last Updated on Sun, Sep 3 2017 4:15 PM

రోహిత్ ఆత్మహత్య: లీవ్‌లో హెచ్‌సీయూ వీసీ

రోహిత్ ఆత్మహత్య: లీవ్‌లో హెచ్‌సీయూ వీసీ

హైదరాబాద్: హెచ్సీయూ యూనివర్సిటీ పీహెచ్డీ విద్యార్థి వేముల రోహిత్ ఆత్మహత్య అనంతరం అతడి కుటుంబానికి న్యాయం చేయాలంటూ విద్యార్థులు దీక్ష చేస్తున్నారు. వర్సిటీలో వాతావరణం ఇలా ఉన్న నేపథ్యంలో వైస్ చాన్సలర్, ప్రొఫెసర్ అప్పారావు లీవ్ లో ఉన్నట్లు సమాచారం. ఆయన లీవ్ పై వెళుతూ ఇన్ఛార్జ్ వీసీగా ప్రొఫెసర్ విపిన్ శ్రీవాత్సవ్ ను నియమించారు. దీనిపై వర్సిటీ విద్యార్థులు మండిపడుతున్నారు.

దీక్ష చేస్తున్న విద్యార్థులు ఎంత చెప్పినా వెనక్కి తగ్గడం లేదని, తనపై ఆరోపణలు వస్తున్నాయని భావించిన వీసీ తాత్కాలికంగా ఈ ఘటన నుంచి తప్పుకునేందుకు లీవ్ పెట్టినట్లు తెలుస్తోంది. ఇన్ఛార్జ్ వీసీగా విపిన్ శ్రీవాత్సవ్ ను నియమించడాన్ని విద్యార్థి సంఘాలు తప్పుబట్టాయి. గతంలోనూ ఓ విద్యార్థి ఆత్మహత్యకు సంబంధించి ఆయనపై అభియోగాలున్నాయి. వర్సిటీ నుంచి సస్పెండ్ చేయడంతో రోహిత్ ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే.

మరోసారి మంటపెట్టారు: విద్యార్థులు
తమ ఉద్యమానికి వీలువ లేకుండా చేస్తున్నారని విద్యార్థులు ఆరోపించారు.  అసలే మా కడుపు మండిపోతుంటే.. మళ్లీ మరోసారి మంట పెట్టిన చర్యగా శ్రీవాత్సవ్ నియామకంపై విద్యార్థులు అభివర్ణించారు. ఎంతో మంది సీనియర్ ప్రొఫెసర్స్ ఉండగా కేవలం శ్రీవాత్సవ్ నే ఇన్ఛార్జ్ వీసీగా నియమించారని ఓ విద్యార్థి ప్రశ్నించారు. చెన్నై నుంచి కొందరు విద్యార్థులు వచ్చారు. కర్ణాటక, ఇతర రాష్ట్రాల నుంచి రేపు మరికొంతమంది విద్యార్థులు వస్తారని దీక్ష తీవ్రరూపం దాల్చుతుందని చెప్పారు. విపిన్ శ్రీవాత్సవ్, వీసీ అప్పారావు ఇద్దరికి రోహిత్ ఆత్మహత్యకు సంబంధం ఉందని విద్యార్థులు ఆరోపిస్తూ తమ ఆందోళనను తీవ్రం చేస్తున్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement