'తెలంగాణ భవన్లోనైనా మేం సిద్ధమే' | we are ready discuss with you on hyderabad develepment: shabbir ali | Sakshi
Sakshi News home page

'తెలంగాణ భవన్లోనైనా మేం సిద్ధమే'

Published Tue, Dec 22 2015 12:54 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

'తెలంగాణ భవన్లోనైనా మేం సిద్ధమే' - Sakshi

'తెలంగాణ భవన్లోనైనా మేం సిద్ధమే'

హైదరాబాద్‌: హైదరాబాద్ అభివృద్ధిపై కాంగ్రెస్ పార్టీ తమతో చర్చకు సిద్ధమేనా అంటూ కేటీఆర్ విసిరిన సవాల్ కు కాంగ్రెస్‌ పార్టీ నేత షబ్బీర్ అలీ స్పందించారు. హైదరాబాద్ అభివృద్దిపై తెలంగాణ భవన్ లోనైనా తాము చర్చకు సిద్ధమే.. మీరు సిద్ధమేనా అంటూ ఆయన ప్రతి సవాల్ విసిరారు. కాంగ్రెస్ పదేళ్ల పాలనలో లక్ష కోట్లతో హైదరాబాద్ ను అభివృద్ది చేసిందని అన్నారు.

జీహెచ్ఎంసీ బడ్జెట్ ను పదిరెట్లు పెంచింది తామేనని చెప్పారు. కేసీఆర్ ఏడాదిన్నర పాలనలో హైదరాబాద్ అభివృద్ధికి చేసిందేమిటని ప్రశ్నించారు. తెలంగాణ ఆత్మగౌరవం ఎక్కడికి పోయిందని నిలదీశారు. చంద్రబాబుకు బహుమతులు ఇస్తూ సీఎం కేసీఆర్ విందులు చేసుకుంటున్నారని మండిపడ్డారు. ఓటుకు కోట్ల కేసును విస్మరించారని గుర్తుచేశారు. సెటిలర్లను జాగో బాగో అన్న టీఆర్ఎస్ నేతలను హైదరాబాద్ మరిచిపోలేదని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement