
హ్యాండ్‌బ్యాగ్ హెల్మెట్!
హెల్మెట్ ఎందుకు పెట్టుకోలేదు అని మోటార్ సైక్లిస్టులను అడగండి. సగం కంటే ఎక్కువ మంది ‘అబ్బే... మోత బరువు సార్’ అనే అంటారు. అలాంటి వారి కోసమేనేమో... న్యూయార్క్‌లోని ఓ కంపెనీ ఈ ఫొటోల్లో చూపిన హెల్మెట్‌ను తయారు చేసింది.
ఏబీఎస్ అనే పదార్థంతో తయారుచేసిన ఈ హెల్మెట్ దృఢంగా ఉండటమే కాకుండా... మామూలు హెల్మెట్ల సైజులో మూడో వంతు మాత్రమే ఉంటుంది. అవసరం లేనప్పుడు దీన్ని మడతపెట్టి బ్యాగులోకి కుక్కేసుకోవచ్చునన్నమాట!