శాస్త్ర పరిజ్ఞానంతో ‘టేపుల’ పరిశీలన | With knowledge of 'Tapes' probation | Sakshi
Sakshi News home page

శాస్త్ర పరిజ్ఞానంతో ‘టేపుల’ పరిశీలన

Published Tue, Jun 9 2015 4:47 AM | Last Updated on Wed, Aug 29 2018 7:31 PM

శాస్త్ర పరిజ్ఞానంతో ‘టేపుల’ పరిశీలన - Sakshi

శాస్త్ర పరిజ్ఞానంతో ‘టేపుల’ పరిశీలన

మంత్రి ఈటల రాజేందర్
కాజీపేట రూరల్: ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి విషయంలో ఏపీ సీఎం చంద్రబాబు స్వయంగా మాట్లాడి డీల్ చేసి తప్పిం చుకుంటున్నాడని, ఆ ఆడియో టేపులను శాస్త్ర పరిజ్ఞానంతో పరిశీలిస్తామని రాష్ట్ర ఆర్థికమంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమంలో భాగంగా 2009లో ఉప్పల్- జమ్మికుంట మధ్య జరిగిన రైలురోకో సందర్భంగా నమోదైన కేసులో మంత్రి సోమవారం వరంగల్ జిల్లా కాజీపేట రైల్వే కోర్టుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఆడియో టేపులు బయటపడక ముందు ఒకలాగా.. బయటపడ్డాక ఒకలాగా రేవంత్‌రెడ్డి వ్యవహరిస్తున్నారన్నారు.

ఈ విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందని పేర్కొన్నారు. తెలంగాణవాదులపై పెట్టిన అక్రమ కేసులను రాష్ట్ర ప్రభుత్వం కొట్టివేసిందని, కేంద్ర ప్రభుత్వం కూడా రైల్వే కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. రైల్వే కేసులను ఎత్తివేయాలని రైల్వే మంత్రిని కలవనున్నట్లు తెలిపారు.  మంత్రి వెంట  ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement