హస్సేన్ సాగర్లో మహిళ మృతదేహం
హైదరాబాద్: నగరంలోని హుస్సేన్సాగర్ చెరువులో శుక్రవారం పోలీసులు గుర్తు తెలియని మహిళ మృతదేహాన్ని గుర్తించారు. మృతురాలి వయస్సు 25 నుంచి 30 ఏళ్ల మధ్య ఉంటుందని పోలీసులు తెలిపారు. మృతురాలు నీలం రంగు పంజాబీ దుస్తులు ధరించి ఉందని వెల్లడించారు. మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.