వివాహేతర సంబంధం: మహిళ హత్య | women murdered over extra marital affair in hyderabad | Sakshi
Sakshi News home page

వివాహేతర సంబంధం: మహిళ హత్య

May 5 2017 1:57 PM | Updated on Sep 5 2017 10:28 AM

వివాహేతర సంబంధం నేపథ్యంలో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది.

హైదరాబాద్: వివాహేతర సంబంధం నేపథ్యంలో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. ఈ సంఘటన నగరంలోని రామాంతపూర్‌ వాసవినగర్‌లో శుక్రవారం వెలుగుచూసింది. స్థానికంగా నివాసముంటున్న మంజుల(38) కూరగాయల వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. రెండేళ్ల క్రితం భర్త మృతిచెందడంతో పరిచయస్థుడైన రోశయ్య అనే వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది.
 
గత కొన్ని రోజులుగా వీరిద్దరి మధ్య తరచు గొడవలు జరుగుతున్నాయి. గురువారం రాత్రి కూడా ఇద్దరి మధ్య వాగ్వాదం జరగింది. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం ఇంట్లో అనుమానాస్పద స్థితిలో మృతిచెంది ఉండటాన్ని గుర్తించిన స్థానికులు ఉప్పల్‌ పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement