లెసైన్స్ ఫీజుపై ఆందోళన అక్కర్లేదు | You do not need to worry on bar license fees | Sakshi
Sakshi News home page

లెసైన్స్ ఫీజుపై ఆందోళన అక్కర్లేదు

Published Tue, Jun 14 2016 2:40 AM | Last Updated on Mon, Aug 20 2018 2:21 PM

You do not need to worry on bar license fees

బార్ల యజమానులకు స్పష్టం చేసిన ఎక్సైజ్ కమిషనర్

 సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని బార్ల లెసైన్స్ ఫీజుల పెంపు ప్రతిపాదనలకు ప్రభుత్వ ఆమోదం లేదని ఆబ్కారీ శాఖ కమిషనర్ చంద్రవదన్ వెల్లడించారు. బార్ల లెసైన్స్ రెన్యూవల్ దరఖాస్తు ఫీజును మాత్రం పది వేల నుంచి లక్ష రూపాయలకు పెంచినట్లు చెప్పారు. ‘తెలంగాణ రెస్టారెంట్ అండ్ బార్ లెసైన్స్ అసోసియేషన్’ అధ్యక్షుడు ఎస్.మనోహర్‌గౌడ్ ఆధ్వర్యంలో బార్ల యజమానులు సోమవారం కమిషనర్‌ను కలి శారు.

ఈ సందర్భంగా బార్ల లెసైన్స్ ఫీజు పెంపు, సీటింగ్ కెపాసిటీ ఆధారంగా అదనపు ఫీజు వసూలు అంశాలపై కమిషనర్‌తో చర్చించారు. ఫీజులు పెంచితే బార్ల నిర్వహణ కష్టమవుతుందని, ఒక్కో బార్ మీద సుమారు 40 కుటుంబాలు ఆధారపడి ఉన్నట్లు కమిషనర్‌కు వివరించారు. స్పందించిన కమిషనర్... రెన్యూవల్ ఫీజు తప్ప మరేదీ పెంచలేదని, యజమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement