ప్రజా పోరాటాలకు వైఎస్ జగన్ అండ | YS Jagan support to Public issues sayes Bhumana | Sakshi
Sakshi News home page

ప్రజా పోరాటాలకు వైఎస్ జగన్ అండ

Published Sun, Oct 16 2016 1:47 AM | Last Updated on Tue, Aug 14 2018 11:26 AM

ప్రజా పోరాటాలకు వైఎస్ జగన్ అండ - Sakshi

ప్రజా పోరాటాలకు వైఎస్ జగన్ అండ

వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్‌రెడ్డి స్పష్టీకరణ
 
 సాక్షి, హైదరాబాద్: సీఎం చంద్రబాబు ప్రభుత్వం చేతిలో దగాపడ్డ ప్రతి ఒక్కరి పోరాటానికి వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అండగా ఉంటారని పార్టీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్‌రెడ్డి చెప్పారు. చంద్రబాబు ఇచ్చిన హామీలను నమ్మి మోసపోయిన ప్రజలు తిరగబడాలని ఆయన పిలుపునిచ్చారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా చంద్రబాబు నెరవేర్చలేదని విమర్శించారు. భూమన శనివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్న ట్రంప్‌కు, చంద్రబాబుకు దగ్గరి పోలికలున్నాయని ఎద్దేవా చేశారు. ట్రంప్ ఆంధ్రా అవతారం చంద్రబాబు అని అభివర్ణించారు. తన అవినీతికి అందరూ ఆమోదముద్ర వేయాలని తపన పడుతూ.. ప్రతిపక్షాలపై నిరంతరం దాడి చేస్తున్నారని ఆరోపించారు.

 ముద్రగడ యాత్రకు వైఎస్సార్‌సీపీ మద్దతు
 ‘‘కాపుల ఉద్యమం తరహాలో పోరాటం చేయాల్సిన సమయం ఆసన్నమైంది. ముద్రగడ పద్మనాభం సత్యాగ్రహ యాత్రకు వైఎస్సార్‌సీపీ మద్దతు ఉంటుంది. బీసీల్లో చేరుస్తామని సీఎం చంద్రబాబు కాపులను దగా చేశారు. తుని ఘటనకు చంద్రబాబే కారణం. ప్రభుత్వ మోసపూరిత విధానాలపై ఉద్యమించేందుకు సిద్ధంగా ఉన్నాం’’ అని భూమన కరుణాకర్‌రెడ్డి పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement