బాబువన్నీ మాయమాటలే | Darmana fires on chandrababu | Sakshi
Sakshi News home page

బాబువన్నీ మాయమాటలే

Published Tue, Apr 12 2016 1:01 AM | Last Updated on Tue, Aug 14 2018 11:26 AM

బాబువన్నీ మాయమాటలే - Sakshi

బాబువన్నీ మాయమాటలే

♦ బడుగుల సంక్షేమానికి బడ్జెట్ లో కేటాయింపులేవి?
♦ వైఎస్సార్‌సీపీ నేత ధర్మాన ప్రసాదరావు మండిపాటు

 సాక్షి, హైదరాబాద్: వెనుకబడిన తరగతుల సంక్షేమం విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు చెబుతున్నవన్నీ మాయమాటలేనని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు విమర్శించారు. బీసీలను మోసగించేందుకు సీఎం నిరంతరం ప్రయత్నిస్తూనే ఉన్నారని ధ్వజమెత్తారు. ధర్మాన సోమవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. 2014 ఎన్నికల సమయంలో టీడీపీ మేనిఫెస్టోలో చంద్రబాబు ఇచ్చిన ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని దుయ్యబట్టారు.

బీసీల అభ్యున్నతి కోసం ప్రతి ఏటా రూ.10,000 కోట్లు కేటాయిస్తామన్నారు, తొలి బడ్జెట్ 2014-15లో రూ.2500 కోట్లు కూడా వారి కోసం ఖర్చు చేయలేదని పేర్కొన్నారు. 2015-16 బడ్జెట్‌లో రూ 6,460 కోట్లు కేటాయించామని చెప్పి రూ.4,120 కోట్లే విడుదల చేశారని తెలిపారు. అందులోనూ రూ.3,975 కోట్లను సవరించిన అంచనాలుగా చూపారన్నారు. వాస్తవిక వ్యయానికి వచ్చేటప్పటికి రూ.2,800 కోట్లో, లేదా రూ.3,000 కోట్లో ఖర్చవుతాయన్నారు. బీసీ సంక్షేమం కోసం మూడేళ్లలో రూ .30 వేల కోట్లు కేటాయించి ఇప్పటికే రూ.20 వేల కోట్లు ఖర్చు చేయాల్సిన ప్రభుత్వం ఇప్పటివరకు రూ.5,500 కోట్ల కంటే ఎక్కువ  ఖర్చు చేయలేదని వెల్లడించారు.

 ఒక్క హామీనైనా నెరవేర్చారా?
 బీసీలకు ఎప్పటికపుడు తియ్యని కబుర్లు చెప్పి మోసం చేయడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ధర్మాన ప్రసాదరావు ఆరోపించారు. మహాత్మా జ్యోతీరావ్‌పూలే జయంతి సభలో ముఖ్యమంత్రి గొప్పగా ఒక ప్రసంగం చేసినంత మాత్రాన బీసీలకు ఒరిగేదేమీ ఉండదన్నారు. బడ్జెట్‌లో నిధులను కేటాయించి, ఖర్చు చేస్తేనే బీసీల జీవన ప్రమాణాలు పెరుగుతాయని చెప్పారు. బీసీలను ఇంకా ఎంతకాలం మోసం చేస్తారని ప్రశ్నించారు. చేనేత కార్మికుల అభివృద్ధి కోసం ఏటా రూ.వెయ్యి కోట్ల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేస్తామంటూ ఇచ్చిన హామీని నెరవేర్చలేదని విమర్శించారు. మత్స్యకారులకు ఇచ్చిన హామీని కూడా ప్రభుత్వం నెరవేర్చలేదన్నారు. తీరప్రాంతాల్లో దుర్భరమైన జీవితం గడుతుపున్న మత్స్యకారుల కుటుం బాల్లో ఏ ఒక్కరైనా చంద్రబాబు చేసిన ప్రయత్నం వల్ల బాగుపడ్డారేమో చెప్పగలరా? అని ధర్మాన నిలదీశారు. ప్రజలంతా జ్యోతీరావ్ పూలేను ఆదర్శంగా తీసుకుని హామీల అమలు కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని పిలుపునిచ్చారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement