ఫిరాయింపు ఎమ్మెల్యేలపై వైఎస్సార్సీపీ ఫిర్యాదు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అసెంబ్లీ కార్యదర్శికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేసింది.
గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి, కందుకూరు ఎమ్మెల్యే పోతుల రామారావులపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని పీఏసీ చైర్మన్, ఆ పార్టీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గురువారం ఫిర్యాదు చేశారు. వారితో పాటు వైఎస్సార్సీపీ గుర్తుపై గెలిచి టీడీపీలో చేరిన వారందరిపై అనర్హత వేటు వేయాలని అసెంబ్లీ ఇన్చార్జి కార్యదర్శి సత్యనారాయణకు బుగ్గన ఫిర్యాదు పత్రాన్ని అందజేశారు.