హైదరాబాద్: ఏపీలో ముస్లిం మైనార్టీలు అంటేనే ప్రభుత్వానికి చాలా చులకనగా ఉందని వైఎస్ఆర్ సీపీ నేతలు మండిపడ్డారు. కేవలం ముస్లిం మైనార్టీలనే కాదు.. క్రిస్టియన్, ఇతర మైనార్టీ వర్గాలపైనా ప్రభుత్వం వివక్ష చూపిస్తోందని ఆరోపించారు. మైనార్టీల గురించి కేవలం ఒక్క ప్రశ్న వేయడానికి మాత్రమే అవకాశం ఇచ్చారని, ఏపీ ప్రభుత్వానికి ఓ కవచంలా స్పీకర్ కోడెల శివప్రసాదరావు పనిచేస్తున్నారని వ్యాఖ్యానించారు. మైనార్టీల అభివృద్ధి, సంక్షేమం కోసం ప్రధాని నరేంద్ర మోదీ 15 పాయింట్ల పథకం ప్రవేశపెట్టారని చెప్పారు.
దీనిపై కనీసం కమిటి వేయలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందని, ఎస్సీలకు ఉన్నట్లుగానే మైనార్టీలకు ఓ సెల్, కమిషన్ ఏర్పాటు చేయాలన్నారు. బీజేపీ, టీడీపీలు కలిసి మైనార్టీల గొంతు నొక్కుతున్నాయని ఆయన మండిపడ్డారు. కొత్తగా గెలిచిన ఎమ్మెల్యేల బాధను పట్టించుకోవడం లేదని అందుకే వైఎస్ఆర్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, స్పీకర్ పై అవిశ్వాసం పెట్టారని ఆ పార్టీ ఎమ్మెల్యే ముస్తఫా అభిప్రాయపడ్డారు. మైనార్టీలు అనగానే మాట్లాడటానికి కేవలం రెండు నిమిషాలు కూడా సమయం ఇవ్వడం లేదని ఆరోపించారు.
వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే అంజాద్ బాషా మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు. 2014-2015 ఆర్థిక సంవత్సరానికి గానూ జరిపిన కేటాయింపులలో కేవలం 60 శాంతం ఖర్చుచేసినట్లు తెలిపారు. టీడీపీ ప్రభుత్వం 370 కోట్ల రూపాయలు కేటాయించినా, కేవలం 203కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చుచేసిందని విమర్శించారు. మైనార్టీ విద్యార్థులకు రూ.60 కోట్లు కేటాయించగా, రూ.20కోట్లు ఖర్చుచేశారని చెప్పారు. ముస్లిం మైనారిటీ స్కూళ్లకు ఒక్క రూపాయి ఖర్చుపెట్టలేదు. వైఎస్ఆర్ సీపీ జిల్లాలో ముస్లింల కోసం రూ. 5.5 కోట్లు కేటాయంపులు చెసినా రూ.2 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని మిగతా జిల్లాల్లో పరిస్థతి ఇంకా ఎంత దారుణంగా ఉందని పేర్కొన్నారు.
- మైనార్టీ నిరుద్యోగులకు వడ్డీ లేకుండా 5 లక్షల వరకు రుణాలు ఇస్తామని చెప్పి పాటించలేదని వ్యాఖ్యానించారు.
- మహిళలకు స్వయం సహాయక గ్రూపులు ఏర్పరచి ఒక్కొక్కరకి రూ.5 వేలు ఇస్తామన్నా ఏ చర్యల తీసుకోలేదు
- మైనార్టీ మహిళల వివాహం కోసం రూ. 50 వేలు ఇప్పిస్తామని మేనిఫెస్టోలో పేర్కొన్నారు కానీ అమలు చేయలేదు.