ప్రభుత్వానికి వైఎస్సార్‌సీపీ తెలంగాణ డిమాండ్
సాక్షి, హైదరాబాద్: నిర్వాసితులకు న్యాయం జరిగేలా కేంద్ర భూసేకరణ చట్టం–2013నే అమలు చేయాలని వైఎస్సా ర్ కాంగ్రెస్ తెలంగాణ కమిటీ డిమాండ్ చేసింది. రాష్ట్ర భూసేకరణ(సవరణ) చట్టానికి కూడా జీవో 123 మాదిరిగా హైకోర్టులో చుక్కెదురయ్యే అవకాశముందని వ్యాఖ్యానించింది. జీవో 123 ద్వారా భూసేకరణ చేయవద్దని, ఒప్పందాలు చేసు కోవద్దని ఆదేశిస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడంపై ఆ పార్టీ తెలంగాణ ప్రధాన కార్యదర్శి గున్‌రెడ్డి రాంభూపాల్ రెడ్డి ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు.
భూసేకరణ చట్టంపై ప్రభుత్వం మొండిగా వ్యవహరించిందని, ఇప్పుడు కోర్టులో ఎదురుదెబ్బ తగిలిందని పేర్కొన్నారు. జీవో 123లో సామాజిక ప్రభావ అంశాలు, బాధితులకు పునరావాసం, పునర్‌నిర్మాణం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోక పోవడం వల్లే ప్రభుత్వానికి హైకోర్టు మొట్టికాయలు వేసిందన్నారు.
కేంద్ర భూసేకరణ చట్టాన్నే అమలు చేయాలి
Published Sat, Jan 7 2017 4:24 AM | Last Updated on Tue, May 29 2018 4:26 PM
Advertisement
Advertisement