శ్రీలంకలో భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడిన ఘటనలో 100 మంది చనిపోయారని భావిస్తున్నారు.
కొలంబో: శ్రీలంకలో భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడిన ఘటనలో 100 మంది చనిపోయారని భావిస్తున్నారు. భారతీయ సంతతికి చెందిన తోట కార్మికులు నివసిస్తున్న గృహాలపై బుధవారం ఉదయం కొండ చరియలు విరిగిపడటంతో అత్యధికులు 30 అడుగుల లోతైన బురదలో చిక్కుకుపోయారు. 6 వరుసలుగా ఉన్న ఇళ్లను భారీ రాళ్లు, బురద ముంచెత్తాయి. అ ఉవ రాష్ట్రం, మధ్య బదుల్లా జిల్లాలోని హల్దుముల్లా ప్రాంతంలో 8 మృతదేహాలను వెలికితీశారు.