లాగోస్: నైజీరియాలోని బౌచి- జోస్ హైవేపై ట్రక్కు, మినీ బస్సు ఢీకొన్న సంఘటనలో 18 మంది ప్రాణాలు కోల్పోయారు. నిర్వహణాలోపంతో హైవేపై భారీగా గతుకులు ఏర్పడటమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది.
ఆదివారం చోటుచేసుకున్న ఈ ప్రమాదంలో చనిపోయిన 18 మంది బస్సులో ప్రయాణిస్తున్నవారేనని పోలీసులు పేర్కొన్నారు.