కాట్మాండ్: నేపాల్ కస్కి జిల్లాలో బుధవారం రాత్రి ఎడతెరపి లేకుండా కురిసిన భారీ వర్షాల కారణంగా పెద్ద ఎత్తున కొండ చరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో 26 మంది మరణించారు. మరో 31 మంది గల్లంతయ్యారని మీడియా గురువారం వెల్లడించింది. జిల్లాలో 27 ఇళ్లు నేలమట్టం అయ్యాయని తెలిపింది.
సహాయక చర్యలు కొనసాగుతున్నాయని... అలాగే గల్లంతైన వారి కోసం చర్యలు చేపట్టినట్లు నేపాల్ ఆర్మీ విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొంది. అయితే కొండ చరియలు విరిగిపడిన కారణంగా వంతెనలు కూలిపోయాయని తెలిపారు. దాంతో సహాయక చర్యలకు కొంత మేర ఆటంకం ఏర్పడిందని నేపాల్ ఆర్మీ పేర్కొంది.