
జైల్లో ఫైట్.. ముగ్గురు మృతి
జైల్లో తలెత్తిన గొడవ ముగ్గురు ప్రాణాల్ని బలిగొంది. ఐదుగురిని గాయపరిచింది.
చుషింగ్(ఓక్లామా): జైల్లో తలెత్తిన గొడవ ముగ్గురు ప్రాణాల్ని బలిగొంది. ఐదుగురిని గాయపరిచింది. ఈ ఘటన అమెరికాలోని ఓక్లామా జైలులో చోటుచేసుకుంది. జైలు నిర్వహణాధికారుల సమాచారం ప్రకారం శనివారం సాయంత్రం మెల్లగా ఏదో అంశానికి సంబంధించి గొడవ ప్రారంభమైంది. ఖైదీల తిట్ల పురాణం మొదలైంది. ఇంతలోనే చేతికి దొరికిన ప్రతి వస్తువును ఒకరిపై ఒకరు విసురుకున్నారు.
ఈ క్రమంలో జైలు సిబ్బందికి గూడా గాయాలయ్యాయి. ఎవరు ఎవరినీ కొడుతున్నారో అర్థం కాలేదు. కానీ బలంగానే కొట్టుకున్నారని మాత్రం అనిపించింది. ఈలోగా జైలు సిబ్బంది జోక్యం చేసుకుంటుండగానే అప్పటికే ముగ్గురు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. కొంతమంది గాయాలపాలయ్యారు.