
ఆ 50 మందిలో 38 మంది భారతీయులే!
కఠ్మాండు: గతవారం నేపాల్లో సంభవించిన భారీ భూకంపంలో ఈరోజు వరకు తెలిసిన సమాచారం ప్రకారం మొత్తం 50 మంది విదేశీయులు మృతి చెందారు. 46 మంది విదేశీయులు గాయపడ్డారు. చనిపోయినవారిలో 38 మంది భారతీయులు ఉన్నట్లు నేపాల్ హొం మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. భారతీయులు మరో పది మంది గాయపడ్డారు. మొత్తం ఆరు వేల ఆరు వందల మంది మృతి చెందగా, 16వేల 500 మంది గాయపడినట్లు పేర్కొంది.
చైనాకు చెందిన ముగ్గురు, ఫ్రాన్స్కు చెందిన ఇద్దరు, అమెరికాకు చెందిన ముగ్గురు, జపాన్, ఆస్ల్రేలియా, ఇస్తోనియా, స్పెయిన్ దేశాలకు చెందిన ఒక్కొక్కరు మృతి చెందినట్లు హొం శాఖ వివరించింది. గాయపడిన భారతీయులను టీచింగ్ హాస్పటల్, పటాన్ హాస్పటల్లో చేర్చినట్లు తెలిపింది.