ఇరాక్లో అల్ ఖైదా తీవ్రవాదులకు గట్టి దెబ్బ తగిలింది. దేశంలోని వివిధ ప్రాంతాలలో భద్రత దళాలు, స్థానిక గిరిజనులతో జరిగిన పోరులో శుక్రవారం దాదాపు 75 మంది అల్ ఖైదా తీవ్రవాదులు హతమైయ్యారని స్థానిక మీడియా శనివారం వెల్లడించింది. అల్ ఖైదా ముఖ్య నేతల్లో ఒకరైన అబ్దుల్ రెహ్మన్ అల్ బగ్దాదీ కూడా ఉన్నారని తెలిపింది.
అనబర్ ప్రొవెన్షియల్ రాజధాని నగరమైన రమదిలో 52 తీవ్రవాదులు మరణించారని, ఆ ప్రాంతానికి పరిసరాల్లో జరిగిన పోరులో మరో 23 మంది మరణించారని వివరించింది. బాగ్దాద్ నగరానికి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న రమదీ, ఫజుల్లా నగరాల్లో అటు భద్రత దళాలు, స్థానికులు ఇటు తీవ్రవాదుల మధ్య పోరు నిరంతరాయంగా కొనసాగుతుందని మీడియా పేర్కొంది.