
వాషింగ్టన్: భారత్‌లో ఐదింట నాలుగొంతుల మందికి తమ ప్రభుత్వంపై విశ్వాసముందని, అయితే ఆసక్తికరంగా.. అధిక శాతం భారతీయులు సైనిక పాలన, నియంతృత్వానికి కూడా మద్దతిస్తున్నారని తాజా ‘ప్యూ’ సర్వే పేర్కొంది. భారత్‌లో 2012 నుంచి ఆర్థిక వృద్ధి రేటు సరాసరి 6.9 శాతం చొప్పున పెరుగుతుందని, ఈ నేపథ్యంలో కేంద్రంలోని ప్రభుత్వంపై నమ్మకముందని 85 శాతం ప్రజలు చెప్పారని తన నివేదికలో వెల్లడించింది. ఏడు దశాబ్దాలుగా బలమైన ప్రజాస్వామ్య దేశంగా ఉన్న భారత్‌లో 55% ప్రజలు ఏదో ఒక రూపంలో నియంతృత్వానికి మద్దతు తెలిపారని, 27% మంది బలమైన నేత అవసరముందని చెప్పారంది.