జపాన్ ప్రధానిగా షింజో అబె మరోసారి ఎన్నికయ్యారు.
టోక్యో: జపాన్ ప్రధానిగా షింజో అబె మరోసారి ఎన్నికయ్యారు. అబె సారథ్యంలోని అధికార లిబరల్ డెమొక్రటిక్ పార్టీ, మిత్రపక్షం కొమీటొ పార్టీ కలసి ఘనవిజయం సాధించాయి. 475 సీట్లకు గాను 246 సీట్లు కైవసం చేసుకుంది. అబె ప్రవేశపెట్టిన ఆర్థిక విధానాలకు రెఫరెండంగా ఈ ఎన్నికలు జరిగాయి. జపాన్ ప్రధానిగా అబె మూడో సారి ఎన్నికయ్యారు.