అక్కడ దత్తత విధానం తగ్గుతోంది! | Adoptions decline after China drops one-child policy | Sakshi
Sakshi News home page

అక్కడ దత్తత విధానం తగ్గుతోంది!

Published Fri, May 27 2016 11:15 AM | Last Updated on Fri, Jul 26 2019 5:59 PM

అక్కడ దత్తత విధానం తగ్గుతోంది! - Sakshi

అక్కడ దత్తత విధానం తగ్గుతోంది!

బీజింగ్: చైనాలో ఇటీవలి కాలంలో పిల్లలను దత్తత తీసుకునే వారి సంఖ్య తగ్గుతోంది. గతంలో ఉన్నటువంటి 'సింగిల్ చైల్డ్' నిబంధన మూలంగా దత్తతవైపు మొగ్గు చూపిన చైనీయులు.. ఆ నిబంధనను సడలించడంతో చిన్నారులను దత్తత తీసుకోవడానికి అంతగా ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది.

కుటుంబంలో ఒక మగ బిడ్డ, ఒక ఆడ బిడ్డ ఉండాలని కోరుకునే వారికి గతంలో ఉన్నటువంటి కుటుంబ నియంత్రణ విధానం అడ్డుగా ఉన్న నేపథ్యంలో ఓకరిని దత్తత తీసుకోవడం ద్వారా పర్ఫెక్ట్ ఫ్యామిలీని పొందేవారు. అయితే ఇప్పుడు సొంతంగా మరో బిడ్డను పొందే అవకాశం ప్రభుత్వం కల్పించడంతో దత్తతవైపు వెళ్లే వారి సంఖ్య తగ్గుతోందట. ఈ వివరాలను శుక్రవారం చైనా పౌరవ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దత్తత విధానం తగ్గిపోవడానికి సామాజిక పరిస్థితులు మెరుగవటం లాంటి ఇతర కారణాలు కూడా ఉన్నాయని అధికారులు వెల్లడించారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement