వృద్ధిలో భారత్‌ వేగం.. చైనా నెమ్మది | India, not China, to be Asia-Pacific growth engine | Sakshi
Sakshi News home page

వృద్ధిలో భారత్‌ వేగం.. చైనా నెమ్మది

Nov 30 2023 4:55 AM | Updated on Nov 30 2023 4:55 AM

India, not China, to be Asia-Pacific growth engine - Sakshi

న్యూఢిల్లీ: ఎకానమీ బాటలో భారత్‌ వేగంగా పరోగమిస్తుంటే.. చైనా నెమ్మదిస్తోందని ఎస్‌అండ్‌పీ గ్లోబల్‌ రేటింగ్స్‌ తన తాజా నివేదికలో పేర్కొంది. ‘చైనా స్లోస్‌... ఇండియా గ్రోస్‌’ అన్న శీర్షికన విడుదలైన నివేదికలో కొన్ని ముఖ్యాంశాలు పరిశీలిస్తే..

► ఆసియా–పసిఫిక్‌ గ్రోత్‌ ఇంజిన్‌... చైనా నుండి దక్షిణ, ఆగ్నేయాసియాలకు మారుతుందని అంచనా.
►చైనా వృద్ధి రేటు 2023లో 5.4 శాతంగా అంచనా. 2024లో ఇది 4.6  శాతానికి తగ్గుతుంది. 2025లో 4.8 శాతానికి పెరుగుతుంది. 2026లో మళ్లీ 4.6 శాతానికి తగ్గుతుంది.  
►ఇక భారత్‌ వృద్ధి 2026లో 7 శాతానికి పెరుగుతుంది. ఇదే సమయంలో వియత్నా వృద్ధి 6.8%, ఫిలిప్పైన్స్‌ వృద్ధి రేటు 6.4 %, ఇండోనేíÙ యా వృద్ధి 5 శాతంగా నమోదయ్యే వీలుంది. భారత్‌తో పాటు ఇండోనేíÙయా, మలేíÙయా, ఫి లిప్పైన్స్‌లో దేశీయ డిమాండ్‌ పటిష్టంగా ఉంది.  
►భారత్‌ వృద్ధి రేటు 2023–24, 2024–25లో 6.4 శాతంగా ఉంటుంది. 2025లో 6.9 శాతంగా, 2026లో 7 శాతంగా సంస్థ అంచనావేస్తోంది. అధిక ఆహార ద్రవ్యోల్బణం, బలహీన ఎగుమతి పరిస్థితులు ఉన్నప్పటికీ భారత్‌లో ఆర్థిక క్రియాశీలత, డిమాండ్‌ పటిష్టంగా ఉన్నాయి.  
►ఆసియా–పసిఫిక్‌ సెంట్రల్‌ బ్యాంకులు వడ్డీ రేట్లను ఎక్కువగా ఉంచే అవకాశం ఉన్నందున, ఈ ప్రాంతంలోని రుణ గ్రహీతలకు రుణ వ్యయాలు, సేవలు భారీగా ఉంటాయి.  
►మధ్యప్రాచ్యంలో  సంఘర్షణలు విస్తరిస్తే.. అవి ప్రపంచ సరఫరా చైన్‌ను దెబ్బతీయవచ్చు.  ఇది ఇంధన వ్యయాలను పెంచుతుంది. తద్వారా ద్రవ్యోల్బణం పెరుగుతంది.  అధిక ఇన్‌పుట్‌ ఖర్చులు కార్పొరేట్‌ మార్జిన్‌లను తగ్గించే అవకాశం ఉంది. ఇది డిమాండ్‌ పరిస్థితులనూ దెబ్బతీసే అవకాశం ఉంది.  
►ఆసియా–పరిఫిక్‌ ప్రాంత వృద్ధి అంచనాలను (చైనా మినహా) 2024కు సంబంధించి 4.4 శాతం నుంచి 4.2 శాతానికి తగ్గిస్తున్నాం. పారిశ్రామిక వృద్ధి అవకాశాలపైనా ప్రతికూల ప్రభావాలు ఉండవచ్చు. ప్రత్యేకించి ఎగుమతుల ఆధారిత తయారీ రంగం కఠిన పరిస్థితులను ఎదుర్కొనే ఇబ్బందులు ఉన్నాయి.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement