ఫ్యాన్స్ కోసం బట్టలు విప్పేసినా.. | Amanda Holden has been accused of editing a bikini picture before sharing it online. | Sakshi
Sakshi News home page

ఫ్యాన్స్ కోసం బట్టలు విప్పేసినా..

Published Thu, Jun 2 2016 4:47 PM | Last Updated on Mon, Sep 4 2017 1:30 AM

ఫ్యాన్స్ కోసం బట్టలు విప్పేసినా..

ఫ్యాన్స్ కోసం బట్టలు విప్పేసినా..

లండన్: ప్రముఖ మోడల్, హాలీవుడ్ నటి అమందా హోల్డెన్కు ఫ్యాన్స్ గట్టి ఝలక్ ఇచ్చారు. ఆమె వారికోసం హాట్ హాట్ గా ఉండేలా ఒక ఫోటో దిగి ఇన్‌ స్టాగ్రమ్లో పోస్ట్ చేయగా అది ఫొటో షాప్ తో చేసిన ఫొటో అని కొట్టి పారేశారు. దీంతో చిన్నబుచ్చుకున్న ఆమె వెంటనే ఆ ఫొటో డిలేట్ చేసింది. ప్రస్తుతం లండన్లో 'బ్రిటన్ గాట్ టాలెంట్' అనే ఒక ప్రత్యేక షో ఫైనల్ ఈవెంట్ జరుగుతోంది. అందులో న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తున్న అమందా ప్రస్తుతం ఆ షోను ఎంజాయ్ చేస్తున్నారు.

ఇందులో భాగంగా ఆమె ఓ సముద్రం ఒడ్డున చెక్కతో చేసిన చిన్న వంతెనపై రెండే రెండు క్లాత్ పీస్లతో బికీనీ వేసుకొని కెమెరాకు ఫోజిచ్చింది. అది కూడా వెనుక నుంచి. ఈ ఫొటోను వెంటనే ఇన్ స్టాగ్రమ్లో పోస్ట్ చేసింది. అయితే, ఈ ఫొటోను వేగంగా షేర్ చేసుకున్న అభిమానులు ఆ తర్వాత తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తమ కళ్లను మోసం చేసేందుకు అమందా ప్రయత్నించారని, ఫొటో షాప్ సహాయంతో ఆమె తన ఫొటోను మార్చి పోస్ట్ చేశారని తీవ్ర విమర్శలు గుప్పించారు. దీంతో చిన్న బోయిన ఆమె వెంటనే ఆ ఫొటో తొలగించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement