ముగ్గురు డాక్టర్లను కత్తితో పొడిచిన రోగి, ఒకరి మృతి | Among three doctors stabbed, one killed in China | Sakshi
Sakshi News home page

ముగ్గురు డాక్టర్లను కత్తితో పొడిచిన రోగి, ఒకరి మృతి

Published Fri, Oct 25 2013 1:57 PM | Last Updated on Fri, Sep 1 2017 11:58 PM

చైనాలో ఓ రోగి ముగ్గురు డాక్టర్లను కత్తితో పొడిచి తీవ్రంగా గాయపరిచాడు. ఓ డాక్డర్ పరిస్థితి విషమంగా ఉంది.

చైనాలో ఓ రోగి ముగ్గురు డాక్టర్లను కత్తితో దాడిచేసిన సంఘటనలో ఓ డాక్డర్ మరణించగా, మరో ఇద్దరు తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నారు. జీజియాంగ్ ప్రావిన్స్లోని వెన్లింగ్ సిటీలోని పీపుల్స్ ఆస్పత్రిలో డాక్టర్లు శుక్రవారం ఉదయం విధుల్లో ఉన్న సమయంలో ఈ సంఘటన జరిగింది.

గాయపడిన వైద్యులకు అదే ఆస్పత్రిలో చికిత్స చేశారు. ఒకరి పరిస్థితి విషమించగా, ఆయన ప్రాణాలు కాపాడేందుకు వైద్యులు శ్రమించినా ఫలితం లేకపోయింది. మరో ఇద్దరు చికిత్స పొందుతున్నారు. నిందితుడు అదే ఆస్పత్రిలో వైద్యం చేయించుకున్నాడు. వైద్యులపై ఎందుకు దాడి చేశాడన్న కారణాలు తెలియరాలేదు. పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి కేసును దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement