పిల్లల కోసం 12 ఏళ్ల పిల్లాడి ఆండ్రాయిడ్ యాప్
పన్నెండేళ్ల వయసు అంటే ఫోన్లతో ఆడుకుంటారనే మనకు తెలుసు. కానీ, టెక్సాస్కు చెందిన ఓ బుడ్డాడు ఏకంగా పిల్లలను కాపాడేందుకు ఓ ఆండ్రాయిడ్ యాప్ తయారుచేశారు. పిల్లలు ఏదైనా ఆపదలో ఉంటే.. వెంటనే పానిక్ బటన్ ఆన్ అయ్యేలా ఈ యాప్ పనిచేస్తుంది. ఒకవేళ ఫోన్ లాక్ అయి ఉంటే, పవర్ బటన్ను ఆరుసార్లు ప్రెస్ చేస్తే.. 'సేవ్ మీ' అనే యాప్ యాక్టివేట్ అవుతుంది. అందులో ప్రోగ్రాం చేసి పెట్టిన పలు నెంబర్లకు ముందుగానే సిద్ధం చేసి ఉంచిన మెసేజ్ వెళ్లిపోతుంది.
దీన్ని మరింత అప్గ్రేడ్ కూడా చేశారు. ఈ వెర్షన్లో పవర్ బటన్ ప్రెస్ చేస్తే ఆ సందేశం అందుకునేవాళ్లకు ఒక జీపీఎస్ మ్యాప్ కూడా వెళ్తుంది. అందులో దాన్ని పంపినవాళ్లు ఎక్కడ ఉన్నారో కూడా తెలిసిపోతుంది. తాను తండ్రితో కలిసి స్కూలుకు వెళ్లేటప్పుడు ఈ యాప్ రూపొందించాలన్న ఆలోచన వచ్చిందని డైలన్ పుసెట్టి అనే ఈ అబ్బాయి చెప్పాడు. తనను ఎవరైనా ఎత్తుకుపోతే, తన జేబులో ఫోన్ ఉంటే వెంటనే ఆ పవర్ బటన్ను ప్రెస్ చేస్తే సరిపోయేలా యాప్ తయారు చేశానన్నాడు. ప్రస్తుతం ఈ యాప్ కేవలం ఆండ్రాయిడ్ వెర్షన్లో మాత్రమే అందుబాటులో ఉంది.