న్యూఢిల్లీ: యెమెన్‌లో జరిగిన వైమానిక దాడుల్లో ఆరుగురు భారతీయులు మృతి చెందారు. ఈ నెల 8న యెమెన్‌లోకి రెండు బోట్లలో చొరబడిన 21 మంది భారతీయులపై సౌదీ అరేబియా నేతృత్వంలోని సంకీర్ణదళాలు వైమానిక దాడులు చేశాయి. 14 మంది తప్పించుకోగా, ఒకరు గల్లంతయ్యారు. చనిపోయిన ఆరుగురికీ హొడైడాలో అంత్యక్రియలు జరిపామని భారత్ తెలిపింది.