2020 నుంచి బ్రిటిష్ ఎంపీలకు మద్యం ఉండదు!
లండన్: 2020 నాటికి బ్రిటిష్ ఎంపీలుగా ఉండేవారు కొద్దిరోజులపాటు మద్యం మానుకోవాల్సి రావచ్చు. ప్రస్తుతం వారు ఉంటున్న ‘ప్యాలెస్ ఆఫ్ వెస్ట్‌మినిస్టర్స్ పార్లమెంటు’ భవనం నవీకరణ పనులను 2020లో మొదలు పెట్టనున్నారు. ఆ సమయంలో వారికి తాత్కాలికంగా ‘రిచ్‌మండ్ హౌస్’లో వసతి కల్పిస్తారు.
ఈ భవనంలో ఇస్లాం నిబంధనలు అమలవుతున్నందున మద్యం తాగడం నిషేధం. కాబట్టి రిచ్‌మండ్ హౌస్‌లో ఉన్నన్ని రోజులూ ఎంపీలు మద్యం తాగకూడదు. పాత భవనం నవీకరణ పూర్తయ్యి, అక్కడికి మారేవరకు పరిస్థితి ఇంతే.