విద్యార్థినికి ఐఎస్ భూతం!
కాలిఫోర్నియా: కాలిఫోర్నియాలో ఓ పాఠశాల పొరపాటు చేసింది. తమ పాఠశాలలో చదువుతున్న విద్యార్థినికి అనుకోకుండా ఉగ్రవాద పేరు అంటగట్టింది. తమ పాఠశాల తరుపున విడుదల చేసిన ఇయర్ బుక్స్ లో ఓ విద్యార్ధిని ఫొటోను ప్రచరిస్తూ ఆమె ఫొటో కింద ఇస్లామిక్ స్టేట్ అంటూ ముద్రించింది. ఇది గుర్తించిన ఆ బాలిక సోషల్ మీడియాలో పెట్టడంతో ఆ తప్పును సరిదిద్దుకునేందుక స్కూల్ యాజమాన్యం వేగంగా ముందుకు కదలింది.
కాలిఫోర్నియాలోని రాంచో కుకమోంగా లోగల లాస్ ఓసోస్ హై స్కూల్ లో బయాన్ జెలిఫ్ అనే విద్యార్థిని చదువుతోంది. ఈ స్కూల్ యాజమాన్యం ప్రతి ఏడాది ఇయర్ బుక్ విడుదల చేస్తోంది. అందులో భాగంగా విద్యార్థుల ఫొటోలను కూడా ముద్రిస్తుంది. అయితే, జెలిఫ్ ఫొటోను ముద్రించిన స్కూల్ యాజమాన్యం ఆ ఫొటో కింద మాత్రం ఐఎస్ఐఎస్ ఫిలిప్ అనే పేరును ముద్రించారు. ఈ విషయం తర్వాత గుర్తించి అప్పటికే 300 మంది విద్యార్థులకు ఇచ్చేసిన పుస్తకాలు ఇప్పటికే వెనక్కి తీసుకున్నారు.